ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

anandayya: ఆనంద‌య్య విష‌యంలో క‌మ్యూనిస్టుల ఎంట్రీ… జ‌గ‌న్ ఎలా డీల్ చేస్తున్నారంటే…

Share

anandayya: క‌రోనా వైద్యం పేరుతో వార్త‌ల్లో వ్య‌క్తిగా నిల‌వ‌డ‌మే ఆశ్చ‌ర్య‌క‌ర‌ ఫ‌లితాల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన కృష్ణ‌ప‌ట్నం ఆనందయ్య విష‌యంలో ఏపీ స‌ర్కారు ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ మందు విశ్వ‌స‌నీయ‌త‌పై విభిన్న అభిప్రాయాలు, అధ్య‌య‌న సం్థ‌ల ప‌రిశీల‌న ప్ర‌క్రియ కొన‌సాగుతున్న స‌మ‌యంలో ఆనందయ్య కి భద్రత పై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవ‌ర్ద‌న్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. త‌ద్వారా ఆనంద‌య్య విష‌యంలో తాము జాగ‌రుక‌త‌తో ఉన్నామ‌నే భావ‌న క‌ల్పించారు.

క‌మ్యూనిస్టుల ఎంట్రీ…

హైదరాబాద్ ప్రైవైట్ ఆస్ప‌త్రుల్లో 75 లక్షల బిల్లు తీసుకొని శ‌వ‌న్ని ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయ‌ని… ఇలాంటి స‌మ‌యంలో ఆనందయ్య మందుపై ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని సీపీఐ సీనియ‌ర్ నేత నారాయ‌ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పటికే 50 వేల మందికి పైగా భాధితులకు ఆనందయ్య మందుని అందించారని పేర్కొన్న నారాయ‌ణ ఆనందయ్యను విష‌యంలో ఎవరూ ఏం చెయ్యలేర‌ని… ఆయనకు చాలా పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉంద‌ని పేర్కొన్నారు. ప్రభుత్వం మందు పంపిణీ నిలిపివెయ్యడం సబబు కాదన్న నారాయణ ప్ర‌భుత్వం ఆలస్యం చేయ‌కుండా మందు పంపిణీ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

జాగ్ర‌త్త‌గా డీల్ చేస్తున్న ఎమ్మెల్యే

ఇదిలాఉండ‌గా అడిషనల్ ఎస్పీ వెంకటరత్నంతో స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవ‌ర్ద‌న్ రెడ్డి స‌మావేశం నిర్వ‌హించి ఆనందయ్యకి గట్టి భద్రత ఇవ్వాల్సిందిగా సూచించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఆనందయ్యకి పోలీసులు రక్షణ కల్పించారని, ఎలాంటి ఇబ్బందులు లేవ‌న్నారు. ఆయుష్ నివేదిక నే ఆనంద‌య్య మందు విష‌యంలో ప్రభుత్వం తుది నివేదిగా తీసుకునే అవకాశం ఉందని ఐసిఎంఆర్ వచ్చే అవసరం లేదని వ్యాఖ్యానించారు. అన్నీ అనుకూలిస్తే ఆనందయ్య మందు పంపిణీ త్వరలో చేస్తామ‌ని ప్రభుత్వం అనుమతి ఇచ్చిన త‌ర్వాత తామే ఇత‌ర ప్రాంతాల వారికి పోస్ట్ ద్వారా పంపిణీ చేస్తామ‌న్నారు.


Share

Related posts

టీడీపీకి రివర్స్ షాక్ ఇచ్చిన మాటల మంత్రి ! ఇక బాబుతో సహా అందరూ సైలెంట్ అవ్వాల్సిందే !!

Yandamuri

Bro daddy : లూసిఫర్ కాంబినేషన్‌లో బ్రో డాడీ..భారీ హిట్ కి స్కెచ్

GRK

romance: శృంగార సమయం లో కొత్తదనం కోసం ఈ డ్రెస్సులు ట్రై చేసి చూడండి …ఇక స్వర్గం మీ సొంతం!!

siddhu