NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

YS jagan: అహం ప్రజాధనం బ్రహ్మశ్మి!

YS jagan పిల్లి పిల్లి కొట్టుకుంటే మధ్యలో న్యాయం చెప్పడానికి వచ్చిన కోతి బాగుపడినట్లు… రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు… రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు జరిగిన న్యాయపోరాటంలో చివరికి గెలుపు ఎవరిదైనా సరే… నష్టపోయింది మాత్రం ప్రజలే. అదెలా అంటారా?? రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి కే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనం ద్వారానే ఫీజు చెల్లిస్తోంది. అంటే ప్రజలకు సంబంధం లేని ప్రజలకు అసలు ఎందుకు పనికిరాని విషయంలో వారు బిల్లు కడుతున్నారన్న మాట. ఒక రకంగా చెప్పాలంటే ఎవరో తిన్న దానికి మనం బిల్లు కట్టినట్లు..

YS jagan: Ego Prajadhanam Brahmashmi!

Supreem court కోట్లలోనే ఫీజు!

హైకోర్టు వరకు రాష్ట్ర ప్రభుత్వ కేసును వాదించడానికి అడ్వకేట్ జనరల్ తో పాటు ఆయనకు సహాయకారిగా మరికొందరు లాయర్లు రాష్ట్రప్రభుత్వం తరపున హైకోర్టులో ఉంటారు. వీరికి నెలవారి జీతాలు ప్రభుత్వం చెల్లిస్తుంది. వీరికి జీతాలు తోపాటు అదనంగా ఎమ్మెల్సీలు కలిపి నెలకు సుమారు రెండు లక్షలకు పైగా జీతాలు ఉంటాయి. హైకోర్టు వరకు మాత్రమే వీరు పనిచేస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గానీ రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా గానీ కోర్టుల్లో కేసులు వాదించడంలో అడ్వకేట్ జనరల్ కీలకం. అలాగే ప్రభుత్వానికి అవసరమైన న్యాయ సూచనలు సలహాలను సైతం వీరు అందిస్తారు. ఇక సుప్రీం కోర్టు వరకు కేసు వెళితే… అక్కడ రాష్ట్రప్రభుత్వం తరపున ప్రత్యేకమైన సిబ్బంది ఏమీ ఉండరు. రాష్ట్ర ప్రభుత్వం సైతం అక్కడ ఓ వ్యక్తిగా మారి వ్యక్తిగతంగా ఓ న్యాయవాది నియమించుకుని కేసును వాదించు కోవాల్సి ఉంటుంది. ఢిల్లీ సర్కిల్ లో సుప్రీంకోర్టు న్యాయవాదుల ఫీజులు మరీ ఎక్కువ. ఇక సీనియర్లు, పలు కేసులలో విజయం సాధించి బాగా పేరు తెచ్చుకున్న వారైతే కోట్లలోనే ఫీజు వసూలు చేస్తారు. కొందరు నిమిషాల మేర కొందరు గంటల మేర ఫీజులను వసూలు చేస్తారు. మొదటి వీరికి కన్సెల్టీగ్ ఫీజు లో సగం ఇచ్చినపుడు మాత్రమే కేసు తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు జరిగిన కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది.. కేంద్రానికి అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన ముకుల్ రోహిత్గి కేసు వాదించారు. ఈయన ఎన్నో ప్రతిష్టాత్మక కేసులను వాదించారు. ముంబై బాంబు పేలుళ్ల కేసులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించింది ఈయనే. దీంతో పాటు పలు ప్రతిష్టాత్మక కేసుల్లో విజయం సాధించిన ట్రాక్ రికార్డు ముకుల్ రోహిత్గి సొంతం. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించి… కేసు ఓడిపోయినప్పటికీ లాయర్ ఫీజులో ఎలాంటి కోత పెట్టడానికి ఉండదు ఈ మొత్తం సొమ్ము ప్రజాధనం నుంచే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది.

ఫీజు ఎక్కువే!

రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేసు వాదించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ముకుల్ రోహత్గి గంటల ప్రకారం ఛార్జ్ చేస్తారు. అంటే కేసు ఆయన తీసుకున్నపుడు కన్సెల్టింగ్ ఫీజు కు అదనంగా గంటకు ఎంత మేర చాట్ చేస్తే అంత మేర తీసుకోవాల్సిందే. ఢిల్లీ సర్కిల్ లో వినిపిస్తున్న మాట ప్రకారం… గంటకు సుమారు 50 నుంచి 60 లక్షల మేర ముకుల్ ఫీజు ఉంటుందని తెలుస్తోంది. అంటే సుప్రీం కోర్టు న్యాయవాది కోర్టుకు వచ్చిన దగ్గరనుంచి ఈ సమయం లెక్కించబడుతుంది. ఆయన కోర్టులో ఎన్ని గంటలు ఉంటే అంత అన్ని గంటల మేర ఛార్జ్ పడుతుంది.
** రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కేసు పూర్తిగా ఎవరి గోల ప్రకారం వారు పెద్దది చేసుకున్నవే. సుప్రీంకోర్టులో కేసు వాదించిన న్యాయమూర్తులు సైతం ఇదే మాట చెప్పారు. రెండు రాజ్యాంగ వ్యవస్థ లో ఎవరి పనులు వారు చేసుకోవాలని కోర్టు వ్యాఖ్యానించడం చూస్తే కేవలం వ్యక్తిగత ఈ గోల ప్రకారమే కేసు పెద్దది అయినట్లు తెలుస్తోంది. మరియు వ్యక్తిగత ఇగోలో అత్యున్నత న్యాయ స్థానం వరకూ వెళ్ళిన పెద్దలు… ఆ డబ్బులు సైతం సొంత ఖాతాలో నుంచి పెడితేనే వ్యక్తిగత ఈగో చల్లారి నట్లు.. అలా కాకుండా మొత్తం భారమంతా ప్రజల మీద ప్రజాధనం మీద వేస్తే.. ఎవరు ఎవరితో పోరాడినట్లు ఎవరు గెలిచినట్లు ఎవరు ఓడినట్లు..?? ఎవరు ఈగోలు చల్లబడినట్లు.. దానికి మూల్యం చెల్లించే లవరు అనేదే ఇప్పుడు అసలైన ప్రశ్న.

author avatar
Comrade CHE

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju