వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవితకాల అధ్యక్షుడుగా వైఎస్ జగన్ ఎన్నిక

Share

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవిత కాల అధ్యక్షుడుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎన్నికైయ్యారు. పార్టీ ప్లీనరీ సమావేశాల్లో ఈ మేరకు తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ తీర్మానంతో పాటు పారదర్శక పాలన – సామాజిక సాధికారత, పరిశ్రమలు – ఎంఎస్ఎంఈలు, వ్యవసాయం తదితర అంశాలపైనా చర్చించి తీర్మానాలను ఆమోదించారు. తీర్మానాల అనంతరం ముగింపు ప్రసంగంలో వైఎస్ జగన్ తనను జీవిత కాల అధ్యక్షుడుగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సభలోనూ జగన్ దుష్టచతుష్టయం అంటూ ప్రతిపక్షాలను, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

 

బాగా మొరిగినంత మాత్రాన గ్రామ సింహాలు సింహాలు అయిపోవని అన్నారు జగన్. చిప్ మోకాలిలోనో, అరికాలులోనో చేతి వేలికో ఉంటో సరిపోదని, అది మెదుడలోనో గుండెలోనో ఉంటే పని చేస్తుందంటూ చంద్రబాబును ఉద్దేశించి సెటైర్ వేశారు జగన్. ఇటీవల చంద్రబాబు ఉంగరాన్ని పెట్టుకోవడం, దానిపై నేతలు అడిగితే దానిలో చిప్ ఉందంటూ చెప్పిన నేపథ్యంలో దాన్ని ఉద్దేశించి జగన్ వ్యంగ్యంగా విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించిన సీఎం జగన్.. చంద్రబాబు, దత్త పుత్రుడు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందంటూ దుయ్యబట్టారు.

 

ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్న ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, వాలంటీర్లు, అధికారులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీతో పాటు మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్పీప్ చేసిందన్నారు జగన్.

 

బ్రేకింగ్ .. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నివాసంలోకి ఆందోళనకారులు..ఆర్మీ క్యాంప్ లో తలదాచుకున్న అధ్యక్షుడు

రాబోయే ఎన్నికల్లో 175 కి 175 నియోజకవర్గాల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. వైసీపీ ప్లీనరీ ముగింపు సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి లక్షలాదిగా తరలివచ్చారు. పార్టీ ఆంచనాలకు అనుగుణంగా లక్షలాది మంది తరలిరావడంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండవ రోజు సమావేశంలోనూ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ హజరైయ్యారు. నిన్న విజయమ్మ తన గౌరవాధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనాామా చేసిన సంగతి తెలిసిందే. తొలుత పలువురు మంత్రులు, సీనియర్ నేతలు ప్రసంగించారు.


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

37 mins ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

60 mins ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

3 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

4 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

4 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

5 hours ago