YS Jagan: జగన్ ధీమా .. మళ్లీ పవర్ పై పక్కా లెక్క ..! వైసీపీ ప్లాన్స్ 2024 ఇదే..

Share

YS Jagan: ఏపిలో జగన్ సర్కార్ పై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ పరిపాలనలో ఫెయిల్ అయ్యారని ప్రచారం చేస్తున్నప్పటికీ కొన్ని వర్గాల్లో ప్రభుత్వం పట్ల అనుకూలత కనబడుతూనే ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ అధికారంలోకి వస్తుంది అని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇదే సందర్భంలో వైసీపీ వర్గాలు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా మరల వైసీపీనే అధికారంలోకి వస్తుంది అని చెబుతున్నారు. టీడీపీ లెక్కలు టీడీపీకి ఉండగా, వైసీపీ లెక్కలు వైసీపీకి ఉన్నాయి.

YS Jagan full confident on next elections

YS Jagan: 90 లేదా 100 స్థానాలు

అయితే  వైసీపీ ధీమా ఏమిటి..? మళ్లీ పక్కాగా అధికారంలోకి వస్తామని ఎలాా చెబుతున్నారు..?  అంతర్గతంగా వేసుకుంటున్న లెక్క లు ఏమిటి అంటే గతంలో వచ్చిన 151 స్థానాలు రాకపోయినా 90 లేదా 100 స్థానాలు వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. ఓటింగ్ శాతం కూడా గతంలో మాదిరిగా 49 శాతం రాకపోయినా 44, 45 శాతం మాత్రం తగ్గదు అన్నట్లుగా వైసీపీ భావిస్తొంది. ఇదే సందర్భంలో టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదరదు.ఆ రెండు పార్టీలు వారి బలాన్ని ఎక్కువగా ఊహించుకుని ధీమాకు పోతుండటం వల్ల ఏకాభిప్రాయానికి రారు అని వైసీపీ నమ్ముతోంది. ఆ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్ల చీలిక ప్రభావం వైసీపీకి అనుకూలిస్తుంది అంచనాతో ఉంది. ఒక వేళ టీడీపీ – జనసేన పొత్తుతో ఉంటే వాళ్లను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి. వాళ్లకి ఏయే వర్గాలను పరిమితం చేయాలన్న వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది వైసీపీ. ఈ రకమైన విశ్లేషణ వైసీపీ పెద్దల్లో నడుస్తున్నట్లు సమాచారం.

 

ఆ వర్గాల్లో సానుకూలత

వైసీపీ అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు ఉంది అంటే .. మహిళల్లో వ్యతిరేకత లేదు. అమ్మఒడి తదితర పథకాల ద్వారా డబ్బులు ఇస్తుండటం వల్ల వాళ్లలో వ్యతిరేకత లేదని చెబుతున్నారు. అలానే గ్రామీణ ప్రాంతాల్లోని కూలీల్లో, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల్లో వైసీపీ పట్ల సానుకూలత ఉంది. అదే విధంగా బీసీల్లోని కొన్ని వర్గాల్లోనూ వైసీపీ పట్ల అనుకూలత ఉంది. వైసీపీ అంచనాలు ఇలా ఉంటే.. బీసీలకు, ఎస్సీలకు గతంలో ఉన్న పథకాలను ఈ ప్రభుత్వం తీసేస్తే వాళ్లలో ఎందుకు అనుకూలత ఉంటుంది వాళ్లు వైసీపీకి వ్యతిరేకమేనని టీడీపీ చెబుతోంది. ఇలా టీడీపీ, వైసీపీ వారి వారి లెక్కల్లో ఉన్నాయి. ఓటర్లు మాత్రం ఎన్నికలకు మూడు నెలల ముందు వరకూ ఎవరికి ఓటు వేయాలి అనేది ఫిక్స్ అవ్వరు. ఇప్పుడు ఎవరు సర్వే చేసినా ప్రజాభిప్రాయం తెలియదు. కొన్ని వర్గాల అభిప్రాయం మాత్రమే వెల్లడి అవుతుంది.


Share

Recent Posts

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

2 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

2 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

2 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

3 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

4 hours ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

5 hours ago