YS Jagan: ర‌ఘురామ‌కు అదిరిపోయే షాకిచ్చిన జ‌గ‌న్‌… టైం ఎప్పుడూ ఒక‌రిదే ఉండ‌దు రాజుగారు!

Share

YS Jagan: వైఎస్ఆర్‌సీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు కు ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దిమ్మ‌తిరిగిపోయే షాక్ ఇచ్చారు. వైసీపీలో ఉంటూనే అధిష్టానానికి వ్యతిరేకంగా ర‌ఘురామ‌కృష్ణంరాజు క‌ల‌క‌లం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. గత కొంతకాలంగా ఆయన చేస్తున్న పొలిటికల్ హడావిడి పీక్స్ కు చేరి ఇటీవ‌ల ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దుకు పిటిషన్ వేసేవర‌కు చేరింది. ఇక త‌న అరెస్టు, బెయిలు త‌ర్వాత అన్ని రాష్ట్రాల సీఎంలకు, గవర్నర్లకు ర‌ఘురామ‌రాజు లేఖ రాయడం క‌ల‌క‌లం రేపింది. ఇలా క‌ల‌క‌లం సృష్టిస్తున్న రఘురామరాజు వైసీపీ చీఫ్ షాక్ ఇచ్చారు.

Read More: Corona: గుడ్ న్యూస్ః150కే హైద‌రాబాద్‌లో క‌రోనా టీకా

రాజుగారు షాక్ తినాల్సిందే…

ర‌ఘురామకృష్ణంరాజు దూకుడుకు కళ్లెం వేసేందుకు వైసీపీ పెద్దలు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాజ‌మండ్రి ఎంపీ, వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ తాజాగా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు రఘురామరాజు పాల్పడ్డారని మార్గాని భరత్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read More: Corona: కరోనాతో పిల్లలకు ప్రమాదం లేదు – ఎవరు ప్ర‌క‌టించారో తెలుసా?

ఘాటు లేఖ‌

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ నిబంధ‌న‌లు అతిక్రమించిన ఎంపీ రఘురామకృష్ణంరాజు ను వెంటనే ప‌దవి నుంచి డిస్‌క్వాలిఫై చేయాల్సిందిగా వైసీపీ చీఫ్ విప్ లేఖ‌లో విజ్ఞ‌ప్తి చేశారు.
నర్సాపురం నుంచి వైసీపీ టికెట్‌పై ఎంపీగా ఎన్నికైన ర‌ఘురామ‌రాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పెద్ద ఎత్తున‌ పాల్పడుతున్నార‌ని ఈ నేప‌థ్యంలో రఘురామకృష్ణంరాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ స్పీక‌ర్ ఓం బిర్లాకు లేఖ అందించారు. ర‌ఘురామ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ చేసిన వ్యాఖ్యలను పేర్కొంటూ గతంలోనే ఆధారాలను సమర్పించామని తెలిపిన వైసీపీ చీఫ్ విప్ మార్గాని భ‌ర‌త్ అన‌ర్హ‌త వేటుకు సంబంధించి అనేక పర్యాయాలు స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన‌ట్టు ఈ సంద‌ర్భంగా గుర్తుచేశారు.


Share

Related posts

‘ఆ కంపెనీతో నాకు సంబంధం లేదు’

sarath

ఎన్నో సంవత్సరాల తరవాత పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్ .. !

GRK

‘సభా సంప్రదాయాలకు త్రిలోదకాలు:అందుకే బాయ్‌కాట్’

somaraju sharma