RaghuRamaKrishnamRaju: ర‌ఘురామ అరెస్టుతో జ‌గ‌న్ ఏం మెసేజ్ ఇస్తున్నారంటే…

Share

RaghuRamaKrishnamRaju:  ఏపీలో జ‌రుగుతున్న హాట్ హాట్ రాజ‌కీయాల్లో భాగంగా వైసీపీ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఉద్దేశ‌పూర్వ‌క వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో వివిధ సెక్ష‌న్ల కింద అరెస్టు చేశామ‌ని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. అయితే, ర‌ఘురామ అరెస్టు వెనుక ఏపీ స‌ర్కారు పెద్ద‌లు స్ప‌ష్ట‌మైన సందేశం ఇస్తున్నార‌ని ప‌లువురు కామెంట్ చేస్తున్నారు.

అరెస్టు లో ప‌క్కా ప్లాన్‌

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు గత కొంతకాలంగా ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాజుపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసేందుకు చాలారోజులుగా ప్రయత్నిస్తున్నారు. జ‌న్మ‌దినం నేప‌థ్యంలో రఘురామకృష్ణంరాజు హైద‌రాబాద్ వ‌చ్చిన‌ట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లోని రఘురామకృష్ణంరాజు ఇంటికి వెళ్లిన ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులిచ్చి అదుపులోకి తీసుకున్నారు.

ఏపీలో చ‌ట్టం లేదా?

రఘురామకృష్ణంరాజు కుమారుడు భరత్ ఈ అరెస్టుపై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. రఘురామను ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదు. అధికారం చేతిలో ఉందని ఏమైనా చేస్తారా? అంటూ భ‌ర‌త్‌ ప్రశ్నించారు. అరెస్ట్‌కు కారణాలు కూడా చెప్పకుండా.. కోర్టులో చూసుకోండంటూ సీఐడీ అధికారులు అన్నారని భరత్ చెప్పారు. రూల్ ఆఫ్‌ లా అనేది ఏపీలో లేదా? 35మంది వచ్చేశారు.. ఫోన్లు లాగేసుకున్నారు. ఒక ఎంపీని, ఒక హార్ట్ పేషెంట్‌ని ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా ఎలా తీసుకుని వెళ్లారు. కింద ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్‌కు వెళ్లేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు అని భరత్ అన్నారు. కాగా, న‌ర‌సాపురం ఎంపీ త‌న‌యుడు చేసిన వ్యాఖ్య‌లు నిజ‌మైతే త‌మ ప్ర‌భుత్వంపై కామెంట్లు చేసిన వారి విష‌యంలో ట్రీట్‌మెంట్ ఇలా ఉంటుంద‌ని ఏపీ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేస్తోందా? అంటూ ప‌లువురు అంటున్నారు.


Share

Related posts

Janhvi Kapoor Latest Wallpapers

Gallery Desk

బాబాయి..బంధుత్వం కుదరదు.. పార్టీ నిర్మాణంలో జగన్ ముద్రే వేరు..!!

somaraju sharma

అమ్మకానికి ప్రధాని మోడీ ఆఫీస్..!!

sekhar