ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం టెక్నాలజీ ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

YS Jagan: భ‌రించ‌డం క‌ష్ట‌మే కానీ… జ‌గ‌న్‌ను అభినందించాల్సిందే.

YS Jagan Planning Blasting Changes in Party Government
Share

YS Jagan: ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకున్న నిర్ణ‌యం ఆచ‌ర‌ణ‌లో భారమే అయిన‌ప్ప‌టికీ దాన్ని అభినందించాల్సిందేన‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. క‌రోనా క‌ట్ట‌డికి బ్రేక్ వేసేలా, నూత‌న నిర్ణ‌యం ఉప‌క‌రిస్తుంద‌ని చెప్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ముగిసిందని భావిస్తూ చాలా చోట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయని.. థర్డ్ వేవ్ ముప్పు మొదలైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను కేంద్రం ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తూ.. జిల్లా స్థాయి అధికారులను వ్యక్తిగతంగా బాధ్యులు చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఏపీ స‌ర్కారు సైతం సంచ‌ల‌న ఆదేశాలు ఇచ్చింది. మాస్కు వినియోగించ‌క‌పోతే 20000 ఫైన్ వేస్తామ‌ని తేల్చిచెప్పింది.

Read More: KCR: ఏపీ ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ చెప్పిన గుడ్ న్యూస్ ఏంటంటే…


ఏపీ స‌ర్కారు సంచ‌ల‌న ఆదేశాలు…
కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపధ్యంలో కేంద్రం ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. ఎక్కడపడితే అక్కడ జనం గుమిగూడుతుండడం.. మాస్కులు లేకుండా తిరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే కరోనా మళ్లీ మొదలయ్యేలా ప్రమాదం కనిపిస్తుండడంతో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులనే కాకుండా దుకాణాలు.. వ్యాపార సంస్థలు, స్వయం ఉపాధి నిర్వాహకులు మాస్కులు లేని వారిని తమవద్ద అనుమతిస్తే గరిష్టంగా రూ.20 వేల వరకు జరిమానా విధిస్తామని వరకు జరిమానా విధిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.

Read More: Corona: షాక్ః మ‌ళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు… మ‌న సంగ‌తి ఏందంటే…

దుకాణం కూడా మూసివేయిస్తార‌ట‌.
దుకాణాలు లేదా వ్యాపార సంస్తల వద్ద మాస్కులు లేని వారు కనిపిస్తే.. సదరు దుకాణ దారుని బాధ్యునిగా పరిగణిస్తూ.. జరిమానా విధించడంతోపాటు 2 లేదా 3 రోజులు దుకాణం మూసివేసే శిక్ష కూడా అమలు చేయనున్నారు. పోలీసులు, అధికారులే కాదు.. ప్రజలు ఎవరైనా ఎక్కడైనా కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించి తమకు ఆ ఫొటోలు పంపితే నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా వాట్సప్‌ నెంబరును ప్రకటిస్తామన్నారు.


Share

Related posts

ఏంటి ‘బిగ్ బాస్’ హౌస్ ఇదా? వైరల్ వీడియో.. హౌస్ ఎలా ఉందో చూడండి!

Teja

లిక్కర్ కావాలంటే డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ టేసుకోవాలంట

Siva Prasad

Jabardasth: జబర్దస్త్ నవీన్ ఆస్తి ఎంతో చూస్తే మీ కళ్లు గిర్రున తిరుగుతాయి

Varun G