YS Jagan: వైజాగ్ ద‌శ మారిపోయే నిర్ణ‌యం తీసుకున్న వైఎస్ జ‌గ‌న్‌

Share

YS Jagan: ఉత్త‌రాంధ్ర కు ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చే వైజాగ్ ద‌శ‌ను మార్చే విష‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌ట్టుద‌ల‌తో సాగుతున్న సంగ‌తి తెలిసిందే. కార్య‌నిర్వాహక రాజ‌ధాని పేరుతో విశాఖ‌ప‌ట్నం రూపురేఖ‌లు మార్చే నిర్ణ‌యం ఇప్ప‌టికే ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే, దీనికి కొన‌సాగింపుగా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోనున్నారు. విశాఖలో వేయి కోట్ల రూపాయలతో టూరిజం అభివృద్ధికి ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.

 

వైజాగ్ ద‌శ మారిపోయేలా….
విశాఖ‌ప‌ట్నం ద‌శ మారిపోయేలా వైజాగ్ బీచ్ కారిడార్ పేరుతో టూరిజం అభివృద్ధికి ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ చర్యలు సిద్ధం చేస్తోంది. భీమిలి నుంచి భోగాపురం ఎయిర్ పోర్టు వరకు ఎంటరైన్మెంట్ జోన్ చేసేలా మాస్టర్ ప్లాన్ వేస్తుంది సర్కార్. సైకిల్ ట్రాక్స్, కాలి బాటలు, సైకిల్ స్టేషన్స్, పబ్లిక్ వైఫై వంటివి ఏర్పాటుకు చర్యలు చేస్తుంది. రోడ్లకు ఇరు వైపులా ప్రజలు సేద తీరేందుకు కుర్చీలు, బెంచీలు ఏర్పాటు చేయనుంది. భోగాపురం ఎయిర్ పోర్టు, భీమిలీ బీచ్ లో సీ-ప్లేన్ తెచ్చేలా రంగం సిద్దం చేస్తున్న ప్రభుత్వం… విశాఖ-భోగాపురం మధ్యలో పది బీచ్ ల అభివృద్ధికి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణ‌యంతో ఇటు వైజాగ్ ద‌శ మారిపోవ‌డ‌మే ఉత్త‌రాంధ్ర అభివృద్ధి సైతం మారుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

విశాఖ‌ప‌ట్నం రాజ‌ధాని అయితే…
వైజాగ్ బీచ్ కారిడార్ ప్రాజెక్టు వెను ఏపీ ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతోంద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఇప్ప‌టికే ఏపీలో ప‌ర్యాట‌కుల‌కు హాట్ స్పాట్ గా మారిన విశాఖ‌ప‌ట్నం … భ‌విష్య‌త్తులో కార్య‌నిర్వాహ‌క రాజ‌ధానిగా మారితే మ‌రింత పెద్ద ఎత్తున సంద‌ర్శ‌కుల‌ను ఆక‌ర్షిస్తుంద‌ని ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో న‌గ‌రానికి వ‌చ్చే వారికి ఆహ్లాదం, అలాగే ఉత్త‌రాంధ్ర అభివృద్ధి అజెండాతో వైజాగ్ బీచ్ కారిడార్ నిర్ణ‌యం తీసుకుంద‌ని పేర్కొంటున్నారు.


Share

Related posts

37 ఏళ్ళు.. 37 సార్లు పాముకాటు..! పాపం “సుబ్రమణ్యం”..!!

Vissu

రివ్యూ : కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’ – నెట్ ఫ్లిక్స్

siddhu

ఈ లక్షణాలు ఉన్న అబ్బాయిలను అమ్మాయిలు చాల ఇష్టపడతారట!!

Kumar