YS Jagan: వైఎస్ జగన్ ని ఇంత ఆనందంగా ఎప్పుడూ చూసి ఉండరు.. చివరికి విజయమ్మ కూడా ఖంగుతిన్నారు..!!

Share

YS Jagan: ఏపిలో వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటింది. అధికారంలోకి వచ్చి ఏడాది తిరక్కముందే కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను చుట్టేసి మనదేశానికి వచ్చింది. అదే క్రమంలో రాష్ట్రంలోకి వచ్చేసింది. లక్షలాది మంది కరోనా బారిన పడ్డారు. లాక్ డౌన్, కర్ఫూ ఆంక్షలు పెట్టడంతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దెబ్బతిన్నది. 2020 లో కరోనా ఫస్ట్ వేవ్ వచ్చింది. 2021లో సెకండ్ వేవ్ కష్టాలు. దీనికి తోడు ఒక సమస్య పోతే మరొక సమస్య అన్నట్లు రాష్ట్రంలో అన్నీ సమస్యలే. ఈ పరిస్థితుల కారణంగా సీఎం వైఎస్ జగన్ బాహాటంగా నవ్వడం అనేది దాదాపు ఎవరూ చూసి ఉండరు. అసెంబ్లీలో సభ్యులు ప్రతిపక్ష నాయకులపై సెటైర్ లు వేసినప్పుడో లేక జగన్మోహనరెడ్డి పాలనపై ప్రశంసల జల్లు కురిపించిన సందర్భంలోనో ముసిముసిగా జగన్ నవ్విన దృశ్యలు చూసి ఉంటారు. అంతకు మించి సిఎం జగన్ బాహాటంగా నవ్వుకున్న రోజులు, మనస్పూర్తిగా ఆనందించిన ఘటనలు లేవనే చెప్పవచ్చు.

YS Jagan happiness face

Read More: Chandrababu: చంద్రబాబుకు వచ్చిన సరికొత్త కష్టం చూసి జగన్ కూడా అయ్యో పాపం అనుకున్నాడు..!

YS Jagan: వివిధ రకాల సమస్యలు, ఒత్తిళ్లు కారణంగా

సహజంగానే పాలకపక్షంలో ఉన్న నేతలు వివిధ రకాల సమస్యలు, ఒత్తిళ్లు కారణంగా ఆనందంలో మునిగి తేలడం అరుదుగా ఉంటుంది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డిని మినహాయిస్తే, ఇతర నేతలు, ముఖ్యమంత్రులు బహిరంగంగా నవ్వుకున్న సందర్భాలు మనకు కనబడలేదు. మూడున్నర దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు సైతం అధికారంలో ఉన్నప్పుడు గానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గానీ ఏదో ఒక సమస్యలతో కనిపిించే వారు. హాయిగా ఆనందంతో పది మందితో కలిసి నవ్వుకున్న సందర్భాలు చూడలేదు. అయితే.. రాష్ట్రం ఆర్ధిక పరమైన ఇబ్బందులు, ఇతర అనేక సమస్యలతో సతమతమవుతున్న ఈ తరుణంలోనూ సీఎం జగన్ ఆనందంతో నవ్వుకున్న సందర్భం రీసెంట్ గా జరిగింది. రీసెంట్ గా ఉద్యోగుల పిఆర్సీ సమస్య పరిష్కారానికి ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం అయిన సందర్భంలో జగన్ మనస్పూర్తిగా నవ్వుకున్నారు.

ఉద్యోగ సంఘ నేతల సమావేశంలో

ఉద్యోగ సంఘాల నేతలకు జగన్.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని వివరిస్తూ పిఆర్సీ ఆశించినంత మేరకు ఇవ్వలేదని కోపం వద్దనీ సానుకూలంగా ఉండాలనీ ఉద్యోగులతో అన్నారు. దీనిపై వారు సానుకూలంగా స్పందిస్తూ “మాకు కోపం ఎందుకు సార్.. మీరు మాకు అడగకుండానే పదవీ విరమణ పయోపరిమితి పెంపు, ఎంఐజీ ప్లాట్ లు ఇలా వరాలు ఇచ్చారు కదా అదే చాలు” అనడంతో జగన్ సహా అక్కడ ఉన్నవారు అందరూ ఘోల్లున నవ్వుకున్నారు. ఈ చిత్రాలు సామాజిక మాద్యమాల్లో వైరల్ అయ్యాయి. విజయమ్మ ఈ ఫోటోలు చూసి ఉంటే విజయమ్మ ఖంగుతినడం ఖాయమనే కామెంట్స్ వినబడుతున్నాయి.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

26 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

29 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago