NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan : ఏంటిది జ‌గ‌న్ గారు…. ఇలా వాళ్ల‌ను బాధ పెట్ట‌డం క‌ర‌క్టేనా?

Visakha Ukku - Shok to TDP YS Jagan serious decision

YS Jagan : ఏపీ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురించి జ‌రుగుతున్న కొత్త చ‌ర్చ ఇది. రాజ‌కీయాల్లో త‌నదైన శైలిలో ముందుకు సాగుతున్న ఈ యువ‌నేత ఇటీవ‌ల సునామీ విజ‌యాల‌ను న‌మోదు చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

అయితే ఎన్నిక‌ల‌కు సంబంధం లేకుండా త‌న ప్ర‌త్యేక‌త‌ల ప‌రంప‌ర కొన‌సాగిస్తున్నారు. తాజాగా ఏపీలో హాట్ టాపిక్ గా మారుతున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విష‌యంలో మ‌ళ్లీ త‌మ వైఖ‌రిని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు తెలిపారు.

Visakha Ukku - Shok to TDP YS Jagan serious decision

YS Jagan పార్ల‌మెంటులో సంచ‌ల‌న నిర్ణ‌యం

గనులు, ఖనిజాల సవరణ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు విజయ సాయిరెడ్డి ఈ సంద‌ర్భంగా పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైఖ‌రిని తేల్చి చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు సామాజిక బాధ్యతను నెరవేర్చే దిశగా పని చేస్తాయన్నారు. అందు వల్ల లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కానీ… ప్రైవేట్‌ రంగ సంస్థలు లాభార్జనే ధ్యేయంగా నడుస్తాయన్నారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థల్ని పునరుజ్జీవానికి ప్రణాళిక రూపొందించడానికి బదులు ప్రైవేటీకరించి చేతులు దులుపుకోవాలని చూడడం తగదంటూ కేంద్ర ప్రభుత్వ తీరును విజ‌య‌సాయిరెడ్డి త‌ప్పుప‌ట్టారు.

ఉక్కు ప‌రిశ్ర‌మ‌పై ఏమంటున్నారంటే…

నూత‌న పాల‌సీ ప్ర‌కారం ప్రభుత్వ రంగ సంస్థలకు గనుల కేటాయించగా మిగిలిన వాటిని మాత్రమే ప్రైవేట్‌ సంస్థలకు ఇవ్వాలని విజయసాయిరెడ్డి సూచించారు. నిర్ణీత కాలపరిమిలో రాష్ట్ర ప్రభుత్వం గనుల వేలం వేయలేకపోతే… వాటిని వేలం వేసే హక్కు కేంద్రం పొందేలా బిల్లులో ప్రతిపాదించారని, ఇది ఫెడరల్‌ స్ఫూర్తికే విరుద్ధమని విజయసాయిరెడ్డి త‌ప్పుప‌ట్టారు. అంగీకరించేది లేదని రాజ్యసభలో స్పష్టం చేశారు. దీంతో పాటుగా విశాఖ ఉక్కుఉ ప్రైవేటీక‌ర‌ణ విష‌యంలో కేంద్రం తీరును ఎండ‌గ‌డుతూ చ‌ర్చ నుంచి విజయసాయిరెడ్డి వాకౌట్ చేశారు. కాగా, గ్రేట‌ర్ విశాఖ ఎన్నిక‌లు కావ‌చ్చు … స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు అయి ఉండ‌వ‌చ్చు వేటితో సంబంధం లేకుండా ప్ర‌జ‌ల ప‌క్ష‌మే త‌న విధానం అని తాజా నిర్ణ‌యంతో సీఎం జ‌గ‌న్ చాటి చెప్పార‌ని వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇలాంటి నిర్ణ‌యాలు వైఎస్ జ‌గ‌న్ పై రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేసే వారిని బాధ పెట్టేవ‌ని కామెంట్ చేస్తున్నారు.

author avatar
sridhar

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N