వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ సమావేశాలు అట్టహాసంగా ప్రారంభమైయ్యాయి. తొలుత పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్లీనరీ సమావేశాలను ప్రారంభించారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి, ప్రార్ధనల అనంతరం విజయమ్మతో కలిసి సీఎం జగన్ విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. తదుపరి విజయమ్మతో కలిసి జగన్ ప్లీనరీ వద్దకు చేరుకున్నారు. ముందుగా జగన్ పార్టీ పతకాన్ని ఆవిష్కరించి ప్లీనరీ సమావేశాలను ప్రారంభించారు. జోహార్ వైఎస్ఆర్.. జై జగన్.. జై వైఎస్ఆర్ సీపీ నినాదాలతో ప్లీనరీ ప్రాంగణం మారుమోగింది. ప్లీనరీకి అన్ని జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి కార్యకర్తల సౌలభ్యం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
నిన్న మొన్నటి వరకూ ప్లీనరీ సమావేశాలకు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హజరు అవుతారా లేదా అన్న సందేహాలతో ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు సంధిస్తున్నారు. ఈ తరుణంలో ఆమె ప్లీనరీ సమావేశాలకు తనయుడుతో కలిసి పాల్గొనడంతో విమర్శకులకు చెక్ పెట్టినట్లు అయ్యింది. కాగా పార్టీ అధినేత జగన్ కీలక ప్రసంగం చేయనున్నారు. మూడేళ్ల పాలన, భవిష్యత్తు ప్రణాళికను ప్రజల ముందు ఉంచనున్నారు. ప్లీనరీ సమావేశాల్లో రెండవ రోజైన శనివారం పార్టీ అధినేత జగన్.. రాబోయే ఎన్నికలకు సంబంధించి సుమారు 50కి పైగా నియోజకవర్గాల అభ్యర్ధులను ప్రకటిస్తారని వార్తలు వినబడుతున్నాయి.
విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…