NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

YS Jagan Minister: ఆ మంత్రికి మాత్రం రీప్లేస్ లేదు..! జగన్ కి సవాల్ శాఖ ఇదే..!

YS Jagan Minister: ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ మార్పులకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చేశారు. కొంత మందిని ఉంచేస్తాము..! కొంత మందిని తీసేస్తాము.! తీసేసిన వాళ్లకు జిల్లా ఇన్ చార్జి లు అవకాశం ఇస్తామని చెప్పేశారు. అయితే ఎవరిని ఉంచుతారు..? ఎవరిని తీసేస్తారు..? అనే విషయంపై చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అయితే ప్రస్తుత కేబినెట్ లో ఒక మంత్రిని మాత్రం కఛ్చితంగా ఉంచాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే … మన రాష్ట్రం ప్రస్తుతం ఆర్ధిక సంక్షోభంలో ఉంది. ఆర్ధికంగా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కొత్త అప్పులు పుట్టడం లేదు. ఆదాయం పెరుగుతున్నా కనిపించడం లేదు. సంక్షేమ పథకాల రూపంలో వెళ్లిపోతోంది.

YS Jagan Minister buggana continuation?
YS Jagan Minister buggana continuation

YS Jagan Minister: చేయబోయే అప్పులను

అయితే ఇక్కడ ఆశ్చర్యకమైన విషయం ఏమిటంటే.. కొత్తగా పుట్టబోయే అబ్బులను ఈ బడ్జెట్ లో పెట్టారు. మన రాష్ట్రానికి ఈ ఆర్ధిక సంవత్సరంలో బడ్జెట్ 2లక్షల 56వేల కోట్ల రూపాయలు. దీనిలో 25 శాతం అప్పుల ద్వారానే తీసుకువచ్చి బడ్జెట్ అమలు చేస్తామని బడ్జెట్ నోట్ లో పెట్టారు. 21 శాతం కేంద్రం నుండి గ్రాంట్ ల రూపంలో వస్తుందని చూపారు. మిగిలింది ఆదాయం రూపంలో వస్తుందని పెట్టారు. రాబోయే కాలంలో చేయబోయే అప్పులను కూడా ముందుగా చూపారు. ఇవన్నీ చేయాల్సింది ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.

YS Jagan Minister: వ్యంగ్యం జోడించి సమాధానాలు

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి విశిష్టమైన వ్యక్తిత్వం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ తరపున 18 మంది ఎమ్మెల్యేలు ఉండగా, అందులో నలుగురో అయిదుగురో యాక్టివ్ గా మాట్లాడుతుంటారు. బుచ్చయ్య చౌదరి. నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, ఏలూరి సాంబశివరావు, స్వామి, ఆదిరెడ్డి భవానీ తదితరులు ఒక్కో అంశంపై మాట్లాడుతుంటారు. వీళ్లందరికీ కామన్ గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యంగ్యం జోడించి సమాధానాలు ఇస్తుంటారు. టీడీపీ సభ్యులు ఏమి మాట్లాడినా వెంటనే ఆయన లేచి వారికి కౌంటర్ ఇస్తుంటారు. వైసీపీకి ఉన్న 151 మంది సభ్యుల్లో బుగ్గన మాత్రమే టీడీపీ సభ్యుల ప్రశ్నలకు ఠక్కున సమాధానాలు ఇస్తుంటారు.

YS Jagan Minister: మరో రెండేళ్లు మంత్రిగా

ఆ పరిజ్ఞానం, పరిపక్వత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి మాత్రమే ఉన్నాయి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మాట తీరు ఉంది, లౌక్యం ఉందీ. వ్యంగ్యం ఉందీ. సబ్జెట్ తీరుగానూ మాట్లాడగలరు. అందుకే మరో రెండేళ్లు కూడా ఆయన మంత్రిగా ఉంటారని అనుకుంటున్నారు. ఆయన స్థానాన్ని వేరే వాళ్లు భర్తీ చేయలేరు. ఇంతకు ముందు 2014 నుండి 2019 వరకూ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ బాధ్యతలను శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు నిర్వహించారు. ఆయన కూడా వ్యంగ్యంగా, లౌక్యంగా సబ్జెట్ చెబుతూనే ప్రతిపక్ష సభ్యులకు సమాధానాలు ఇచ్చేవారు. అప్పుడు యనమల మాదిరిగానే ఇప్పుడు బుగ్గన ఆ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

author avatar
Srinivas Manem

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!