YS Jagan: సినిమా పాలిటిక్స్ – ఆన్లైన్ టికెట్లు అసలు సమస్య..!!

Electricity Crises: What is Solutions for Crises
Share

YS Jagan:  ప్రస్తుతం ఏపిలో సినిమా టికెట్‌ల విక్రయ పంచాయతీ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. సినీ పెద్దలు కోరితేనే ఆన్ లైన్ టికెట్ విక్రయానికి సంబంధించి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ప్రభుత్వం చెబుతున్నారు. ఆన్ లైన్ ద్వారా టికెట్ లు విక్రయించడం వల్ల ప్రజలకు వచ్చే నష్టం ఏమీ లేదనీ, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కశ్చితంగా వస్తుందని, పారదర్శకత కోసమే ఈ అడుగులు అని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. పెద్ద హీరోల సినిమాలు విడుదలైన సమయంలో ధియేటర్ల యజమాన్యాలు అధిక ధరలకు విక్రయించడం వల్ల అభిమానులు నష్టపోతున్నారనీ, అలా అధికంగా వచ్చిన సొమ్ము అంతా హీరోల అధిక రెమ్యూనరేషన్ లకు, నిర్మాతల గుత్తాధిపత్యానికి దారి తీస్తున్నాయనీ, చిన్న చిత్రాల మనుగడను దెబ్బతీస్తున్నారని ఒక వాదన. ఇండస్ట్రీ సవ్యంగా నడవాలంటే టికెట్ ధరల నియంత్రించడానికి ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగడాన్ని అటు సినీ ప్రముఖులు, ఇటు ప్రజలు స్వాగతిస్తూనే ఉన్నారు. ఈ చర్యల వల్ల చిన్న చిత్రాలకు సైతం థియేటర్లు అందుబాటులో వస్తాయన్న మాట కూడా వినబడుతోంది.

YS Jagan: ప్రభుత్వం చేతికి వెళితే సినిమా టికెట్ ధరలు పెరుగుతాయా..?

అయితే…సినిమా టికెట్ల వ్యవహారం పూర్తిగా ప్రభుత్వ హస్తగతం అయితే మద్యంకు ప్రజలను దూరం చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ధరలు పెంచినట్లు సినిమా వ్యవసానికి జనాలను దూరం చేయాలని టికెట్ ల ధరలను అమాంతం పెంచేస్తుందేమో అన్న భయం కూడా సామాన్య ప్రజానీకంలో మొదలవుతోంది. వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక, మద్యం వ్యాపారం చేస్తోంది. ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిన తరువాత ఇసుక ధరలు అమాంతం పెరిగాయి. అదే విధంగా మద్యం ధరులు విపరీతంగా పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సినిమా టికెట్ ల ధరలు పెంచితే తద్వారా ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో ఆదాయం పెరుగుతుందన్న భావనతో టికెట్ ధరలు పెంచదన్న గ్యారంటీ ఏమైనా ఉందా అన్నది సగటు మనిషి డౌట్.

YS Jagan: ప్రజల భయం ఇదీ

ప్రస్తుతం సినిమా విడుదల అయిన కొత్తలో బ్లాక్ మార్కెట్ లో టికెట్లు విక్రయిస్తే అభిమానులు మాత్రమే నష్టపోతారు. రేపు ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా టికెట్ ధరలను పెంపు చేస్తే అభిమానులతో పాటు సగటు ప్రజలకు భారం అవుతుంది. సామాన్య మధ్య తరగతి ప్రజానీకానికి వినోదం కూడా మోయలేని భారం అవుతుందన్న గుబులు రేగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం టికెట్ల ఆన్ లైన్ వ్యవస్థను ప్రభుత్వం స్వీకరించే సమయంలోనే ప్రజలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఏంతైనా ఉంది. అభిమానులకు ఉన్న భయాందోళనలను తొలగించకుండా ప్రభుత్వం చర్యలు చేపడితే సినీ పెద్దల ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోందని భావించే అవకాశం ఉంది.


Share

Related posts

బిగ్ బాస్ 4: తమిళ్ బిగ్ బాస్ ఎఫెక్ట్ తెలుగు బిగ్ బాస్ పై సెటైర్లు..!!

sekhar

వాయుసేన విమానం కూలి పైలెట్లు మృతి

somaraju sharma

సాగునీటికి అధిక ప్రాధాన్యం: గవర్నర్

Siva Prasad