ys jagan: జగన్ ఇమేజ్ ని ఎవరెస్టు రేంజ్ కి చేర్చిన ఉదారత!ఇది ఆషామాషీ సాయంకాదు!హ్యాట్సాఫ్ సీఎం గారూ!!

Share

ys jagan: నేను ఉన్నాను ..నేను విన్నాను అని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరూపించుకున్నారు.తన మాటల సీఎంను కానని చేతల ముఖ్యమంత్రినని రుజువు చేసుకున్నారు.చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఒక ప్రభుత్వ వైద్యుడి చికిత్సకు ఏకంగా కోటి రూపాయలు ఆన్ ది స్పాట్ మంజూరు చేసి ముఖ్యమంత్రి జగన్ ప్రకాశం జిల్లా ప్రజల హృదయాలను గెలుచుకున్నారు.ఈ ఒక్క చర్యతో ముఖ్యమంత్రి ఇమేజ్ ఎవరెస్ట్ రేంజికి చేరుకుంది.

ప్రజా వైద్యునికి అండగా నిలిచిన జగన్ ప్రభుత్వం

ప్రకాశం జిల్లా కారంచేడు పిహెచ్సిలో వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ ఎన్ భాస్కర్రావు ప్రజావైద్యుడిగా పేరుగాంచారు.గత యేడాది కరోనా మొదటి వేవ్ సందర్బంగా ఆయన కారంచేడు చుట్టుపక్కల మండలాల్లో వేలాది మంది ప్రాణాలను కాపాడారు.దాదాపు ఆరేడు వేల మందికి ఆయన చికిత్స అందజేసినట్లు అదే పీహెచ్సీ సెకండ్ యూనిట్ డాక్టర్ జెస్సీ చెప్పారు.అయితే దురదృష్టవశాత్తు కరోనా సెకండ్ వేవ్ లో ఆ మహమ్మారి బారిన డాక్టర్ భాస్కర్రావు పడ్డారు.రోజుల్లోనే ఆయన పరిస్థితి క్షీణించిపోయింది.వెంటిలేటర్ పై చికిత్స పొందాల్సిన పరిస్థితి ఎదురైంది.చివరగా చూస్తే ఆయన రెండు ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయినట్టు నిర్ధారణయ్యింది.వాటిని మారిస్తేనే ఆయన బతుకుతారని వైద్యులు తేల్చారు .ఇందుకు కోటిన్నర రూపాయల దాకా వ్యయం కావచ్చునని అంచనా వేశారు.అంత ఆర్థిక స్థోమత లేని ఆ వైద్యుని కుటుంబం తగిన సహాయం కోసం ప్రకాశం జిల్లా మంత్రి బాలినేని వాసుని కలిసింది.

ఒకే నిముషంలో ఓకే చెప్పిన సీఎం !

బాలినేని వాసు వాళ్ళు చెప్పిందంతా శ్రద్ధగా విని వెంటనే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ కు తెలియజేశారు.జగన్ వెంటనే చలించిపోయారు.మరుక్షణంలోనే డాక్టర్ భాస్కర్రావు వైద్య చికిత్సకు కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించాల్సిందిగా మంత్రిని కోరారు.అవసరమైతే మరో యాభై లక్షల రూపాయలు కూడా ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు మంత్రి వాసు ఈ సందర్భంగా తెలిపారు.డాక్టర్ భాస్కర్రావు కుటుంబసభ్యులు ఇందుకుగాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ,బాలినేని వాసులకు కృతజ్ఞతలు తెలిపారు.ఒక ప్రభుత్వ వైద్యుడి ప్రాణాలు నిలపడం కోసం ముఖ్యమంత్రి స్థాయిలో మానవతా దృక్పథంతో ఆలోచించి కోటి రూపాయలు మంజూరు చేయటం నిజంగా గొప్ప విషయమే.ఈ విషయంలో సీఎం జగన్ ఎంతైనా అభినందనీయులు.


Share

Related posts

బిగ్ బాస్ 4 : షాకులకే షాక్ ఇది…! ఆ కంటెస్టెంట్ కు ఓటు వేయమని అడిగిన ఆర్జీవి..!

arun kanna

ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ ఆయనని తీసుకు వస్తున్నారా ..?

GRK

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి..!!

sekhar