NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: వైసీపీ టార్గెట్ 175కి 175 .. పార్టీ నేతలకు వైఎస్ జగన్ సూచన

YS Jagan

YS Jagan on Andhra Pradesh Elections 2024: గత ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు 151 సీట్లు వచ్చాయి, వచ్చే ఎన్నికల్లో 175కి 175 సాధించాలన్న లక్ష్యంతో నాయకులు కృషి చేయాలని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ సూచించారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో బుధవారం వర్క్ షాపు నిర్వహించారు. మంత్రులు, రీజనల్ కోఆర్డినేటర్ లు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు వర్క్ షాపుకు హజరుకాగా వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గడప గడపకూ అనేది నిరంతరాయంగా జరిగే కార్యక్రమమని అన్నారు. దాదాపు ఎనిమిది నెలల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.

 

YS Jagan Review meeting on gadapa gadapaku mana prabhutvam
<span style=color ff6600>Andhra Pradesh Elections YS Jagan Review meeting on gadapa gadapaku mana prabhutvam<span>

 

YS Jagan: ప్రజల విజ్ఞప్తులపై తక్షణం చర్యలు చేపట్టాలి

ఒక్కో సచివాలయానికి రెండు రోజుల పాటు కేటాయించాలన్నారు. గడప గడపకూ కార్యక్రమాన్ని ఏ విధంగా చేశాం..? ఎలా చేస్తున్నాం..? ఇంకా ఎలా మెరుగుపర్చుకోవాలి..? ఎలా సమర్ధత పెంచుకోవాలని..? అనే విషయాలపై నిరంతరం చర్చించుకోవాలని, అందుకోసం నెలకు ఒక సారి వర్క్ షాపు నిర్వహిస్తామని చెప్పారు.  ప్రజా ప్రతినిధుల నుండి ఈ వర్క్ షాపులో సూచనలు, సలహాలు తీసుకంటామన్నారు.  గడప గడపకూ కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తులపై తక్షణం పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాబోయే ఎన్నికల్లో 175 కి 175 స్థానాలు సాధించాలన్నది మన లక్ష్యమని జగన్ అన్నారు.

Andhra Pradesh Chief Minister YS Jagan on upcoming Andhra Pradesh Elections Strategy in 2024

Andhra Pradesh Chief Minister YS Jagan on upcoming Andhra Pradesh Elections Strategy in 2024

 

YS Jagan: కుప్పం మున్సిపాలిటీ లో వైసీపీ గెలుస్తుందని ఎవరైనా అనుకున్నారా..?

పార్టీ, కులం, మతం అనేవి చూడకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు పథకాలు చేరాయని చెప్పారు. సంతృప్తి స్థాయిలో మంచి చేశామని చెప్పుకోగలుగుతున్నామనీ, అందుకే కాలర్ ఎగరేసుకుని ప్రజల్లో తిరుగగలుతున్నామని అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామనీ, కుప్పంలో మున్సిపాలిటీ గెలుస్తామని ఎవరైనా అనుకున్నారా అని ప్రశ్నించారు. ప్రతి నెలా 20 రోజులు గడప గడపకూ నిర్వహించాలనీ, ప్రతి నెలా పది సచివాలయాల్లో నిర్వహించేలా ప్రణాళిక వేసుకోవాలని ప్రజా ప్రతినిధులకు జగన్ సూచించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju