YS Jagan: జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం… ఏపీలో ప‌రిస్థితి మారుతుందా?

Share

YS Jagan: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో కరోనా ఆంక్షలను మ‌రింత కఠినంగా అమలు చేయబోతున్నారు. ఇలాంటి త‌రుణంలో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఏపీలో కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్‌కు సంబంధించిన అన్ని సమస్యలకు 104 కాల్ సెంటర్ వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ గా ఉండాలని.. 104కు ఫోన్‌ చేసిన వెంటనే 3 గంటల్లో బెడ్‌ కేటాయించాలని ఆదేశించారు. మందులు కూడా ఫ్రీగా ఇవ్వాలని… 104 కాల్‌ సెంటర్‌కు సంబంధించి తగిన సంఖ్యలో వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు.

సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం

జిల్లాల్లో ఒక జేసీ ఇక నుంచి కోవిడ్‌పైనే దృష్టి పెట్టాలని.. అప్పుడే అనుకున్న స్థాయిలో సేవలందించగలుగుతామని సీఎం వైఎస్ జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులు, కోవిడ్‌ చికిత్స చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు, కోవిడ్‌ చికిత్స చేస్తున్న ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను కూడా జేసీ చూడాలని ఆదేశించారు. అన్ని ఆస్పత్రులలో వైద్య సిబ్బంది, పారా మెడికల్‌ సిబ్బంది పూర్తి స్థాయిలో ఉండాలని..ఎక్కడ ఖాళీలున్నా వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించండి.. 48 గంటల్లో నియామకాలు పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ఒకే చోట చేరకుండా చూడాలని..పెళ్లిళ్లలకు కేవలం 50 మందికి మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. స్విమ్మింగ్‌ పూల్స్, జిమ్‌లు, పార్కుల్లో అందరూ ఒకేచోట చేరకుండా చూడాలన్నారు.

వ్యాక్సిన్ ఇవ్వ‌లేని ప‌రిస్థితి …

మ‌రోవైపు 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్‌ విష‌యంలో ఏపీ స‌ర్కారు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మే 1 తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ ఇవ్వలేమని… ఏపీలో 2 కోట్ల 4 లక్షల మంది 18-45 ఏళ్ల వయసున్న వారు ఉన్నారని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. టీకాల కోసం వివిధ కంపెనీలతో మాట్లాడామని..ఉత్పత్తిలో సగం కేంద్రానికి ఇవ్వాలి ఆ తర్వాతే రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారని తెలిపారు. వాళ్లు చెబుతున్న లెక్కల ప్రకారం జూన్ వరకు రాష్ట్రాలకు టీకాలు సరఫరా చేయలేరని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా రెమిడెసివిర్ కొరత లేకుండా చూస్తున్నామని ప్ర‌క‌టించారు.


Share

Related posts

కర్నూల్ లో నేడు సిఎం జగన్ పర్యటన ఇలా

somaraju sharma

వామ్మో.. యాంకర్ శ్యామలలో ఇంత ఫైర్ ఉందా? రచ్చ రచ్చ చేసిందిగా..!

Varun G

Today Horoscope సెప్టెంబర్ 9th బుధవారం మీ రాశి ఫలాలు

Sree matha