NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan, Sharmila: వాట్‌యే కో ఇన్సిడెంట్..! అన్న జగన్ అనంతపురం రాయదుర్గంలో, సోదరి షర్మిల హైదరాబాద్ రాయదుర్గంలో..!!

YS Jagan, Sharmila: ఈ రోజు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి. తండ్రి జయంతి సందర్భంగా వైసీపీ అధినేత, ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, ఆయన సోదరి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపిస్తున్న వైఎస్ షర్మిల పులివెందులలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద జరిగే ప్రార్థనలో ఉదయం కలిసి పాల్గొంటారని ఆ పార్టీ నేతలు భావించారు. కానీ అలా జరగలేదు. ఉదయమే షర్మిల వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి తల్లి విజయమ్మతో కలిసి ప్రత్యేక విమానంలో కడప నుండి హైదరాబాద్ పయనమైయ్యారు.

YS Jagan, Sharmila both in rayadurgam
YS Jagan Sharmila both in rayadurgam

Read More: KCR: జగన్ + రేవంత్ + కిషన్.. ముగ్గురు రెడ్ల తలరాతను ఒక్క నిర్ణయంతో మార్చేసిన కేసిఆర్

ఏపి సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నుండి నేరుగా అనంతపురం జిల్లా రాయదుర్గం వెళ్లారు. అక్కడ రైతు దినోత్సవంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. దివంగత వైఎస్ఆర్ బతికున్నంత కాలం రైతుల గురించే అలోచించారనీ, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని వైఎస్ నమ్మారని జగన్ పేర్కొన్నారు. సాగు రంగంలో విప్లవానికి వైఎస్ నాంది పలికారన్నారు. జలయజ్ఞంతో రాష్ట్రం రూపురేఖలు మార్చారని వెల్లడించారు. వైఎస్ స్పూర్తిగా రైతుల పక్షపాత ప్రభుత్వంగా సాగుతున్నామని జగన్ స్పష్టం చేశారు. పలు అబివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను నిర్వహించిన వైఎస్ జగన్ సాయంత్రం ఇడుపులపాయ వెళ్లి వైఎస్ఆర్ ఘాట్ వద్ద భార్య భారతితో కలిసి నివాళులర్పించారు. ప్రార్థనలో పాల్గొన్నారు. పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న వైఎస్ షర్మిల, విజయమ్మ రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకుని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం చేస్తూ పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైఎస్ నాయకత్వాన్ని నిలబెడతా..రాజన్న రాజ్యం తెస్తానని షర్మిల ప్రకటించారు. శుత్రువులు సైతం ప్రశంసించిన నేత వైఎస్ఆర్ అని, ఆయన జయంతి అందరికీ పండుగ రోజు అని వెల్లడించారు. ఆయన చూపిన బాటలోనే  వైఎస్ఆర్ టీపీ ఏర్పాటు చేశామన్నారు. వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావడానికి వచ్చామని పేర్కొన్నారు. వైఎస్ఆర్ టీపీలో మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయన్నారు. పేదరికం రూపుమాపడం, సంక్షేమం, స్వయం సమృద్ధి ఈ మూడు అంశాలపై పార్టీ దృష్టి పెట్టనుందని చెప్పారు.

ఇది యాదృశ్చికమో లేదా ముందుగా అనుకున్న విధంగా ఏర్పాటు చేసుకున్నారో తెలియదు కానీ జగన్ అనంతపురం  జిల్లా రాయదుర్గంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం. అదే సమయంలో ఆయన సోదరి షర్మిల హైదరాబాద్ లోని రాయదుర్గంలో పార్టీ ప్రకటన చేయడం గమనార్హం.  గత ఏడాది వరకూ వైఎస్ వర్థంతి, జయంతి కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులు అందరూ కలిసి పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి వైఎస్ జయంతి కార్యక్రమంలో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు వేరువేరుగా ప్రార్థనలో పాల్గొనడంతో కొంత గ్యాప్ అయితే ఉన్నదనే విషయం ఇప్పుడు బహిర్గతం అయ్యింది.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju