NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan Sharmila: తండ్రి సమాధి వద్ద కలిసిన జగన్ – షర్మిల – విజయమ్మ :  ఒకేసారి ప్రార్ధనలు

YS Jagan Sharmila: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు నివాళులర్పించారు. ఏపి సీఎం వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి భారతి తదితర కుటుంబ సభ్యులు ఘాట్ వద్ద నివాళులర్పించి, ప్రాధనలో పాల్గొన్నారు. వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టిన తరువాత సోదరుడు జగన్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం ఇదే తొలిసారి.

YS Jagan Sharmila pays tribute ysr ghat
YS Jagan Sharmila pays tribute ysr ghat

ఇంతకు ముందు వైఎస్ జయంతి సందర్భంలో ఇద్దరు తారసపడతారని భావించినా వేరువేరుగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టిన తరువాత అన్న చెల్లెలి మధ్య గ్యాప్ పేరిగిందని వార్తలు వచ్చాయి. ఇటీవల రాఖీ పండుగ రోజున కలుసుకోలేదని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వైఎస్ వర్థంతి రోజున కలిసి కార్యక్రమంలో పాల్గొంటారా లేక వేరువేరుగా పాల్గొంటారా అనే ఊహాగానాలు వచ్చాయి. అయితే ఈ ఊహాగానాలకు భిన్నంగా కుటుంబ సభ్యులు అందరూ కలిసే ఘాట్ వద్ద ప్రార్ధనలో పాల్గొన్నారు. జగన్, షర్మిల ఇద్దరూ బుదవారం రాత్రి ఇడుపులపాయ గెస్ట హౌస్ లోనే బస చేసిన విషయం తెలిసిందే.

వైఎస్ఆర్ వర్థంతి సందర్భంగా వైఎస్ జగన్, విజయమ్మ, షర్మిల అందరూ కలిసి కార్యక్రమంలో పాల్గొనడంతో అన్నా చెల్లెలి మధ్య ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం అవుతోంది. గతంలో సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పినట్లు అభిప్రాయ భేదాలు తప్ప విభేదాలు ఏమి లేవని తేలిపోయింది.

కోవిడ్ నేపథ్యంలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ (ఎస్ఓపి) మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి హజరైన ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీ సహా ఇతర విఐపీలను ప్రతి ఒక్కరి హ్యాండ్స్ శానిటేషన్, ధర్మల్ స్ర్కీనింగ్ చేశారు. సామాజిక దూరం పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!

PM Modi: రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోడీ కౌంటర్ ఇలా .. ‘శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ నాలుగో తేదీ తెలుస్తుంది’  

sharma somaraju