NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: చంద్రబాబుపై మరో సారి సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవేళ నగరిలో విద్యాదీవెన నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేద పిల్లలు ఇబ్బంది పడకూడదనే విద్యదీవెన తీసుకువచ్చామని అన్నారు. ఇది వాళ్ల భవిష్యత్తు మార్చబోయే పథకం అని అన్నారు. నాలుగేళ్ల కాలంలో ఈ పథకం ద్వారా రూ.11,300 కోట్లు జమ చేశామన్నారు. 8,44,336 మంది మంది తల్లుల ఖాతాలో రూ.680 కోట్లు జమ చేస్తున్నామన్నారు. పేద విద్యార్ధుల కోసం జగనన్న వసతి దీవెన కూడా అమలు చేస్తున్నామన్నారు.

ఇదే క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడవడానికి ఏ మాత్రం వెనుకాడని చంద్రబాబు, ఆయన చావుకు కారణమైయ్యాడనీ, ఇప్పుడు ఆయన ఫోటోకు దండం పెడుతున్నాడని విమర్శించారు. ఎన్టీఆర్ నాణెం విడుదల కోసం ఢిల్లీ కూడా వెళ్లాడన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డి అయినా తింటాడని దుయ్యబట్టారు. 28 ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి అయ్యాడు, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశాడు, ఆయన పేరు చెబితే ఒక్క పథకమైనా కనిపిస్తుందా అని ప్రశ్నించారు.

 

సొంత కొడుకు మీదే చంద్రబాబుకు నమ్మకం లేక దత్తపుత్రుడికి ప్యాకేజీ ఇచ్చి అరువు తెచ్చుకున్నారని విమర్శించారు. చంద్రబాబు జీవితం అంతా వెన్నుపోట్లు, అబద్దాలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలనే నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.  రెచ్చగొట్టి గొడవలు పెట్టి, శవరాజకీయాలు చేయాలన్నదే ఆయన ఉద్దేశమన్నారు. కావాలనే పోలీసులపై రాళ్లు రువ్వించి దాడి చేయించాడనీ, ఓ పోలీసు కన్ను కూడా పొగొట్టారని ఆరోపించారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆర్కే రోజా, ఉషశ్రీ చరణ్, డిప్యూటి సీఎం నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Children’s Story: పిచుక గుణం | Pillala Kathalu

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

YSRCP: వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోకు మూహూర్తం ఫిక్స్ .. బాపట్ల సిద్ధం వేదికగా సీఎం జగన్ ప్రకటన .. సర్వత్రా ఆసక్తి .. ఎందుకంటే..?

sharma somaraju

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!

బొత్స‌పై పోటీ చేయ్‌… ఆ లేడీ లీడ‌ర్‌ను బ‌తిమిలాడుకుంటోన్న చంద్ర‌బాబు…?

హ‌రిరామ జోగ‌య్య కొడుక్కి జ‌గ‌న్ టిక్కెట్‌… ఎక్క‌డ నుంచి అంటే…!

GHMC: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..జీహెచ్ఎంసీలోకి ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 30 మున్సిపాలిటీలు విలీనం..? ఇక గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్

sharma somaraju

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

టీడీపీ గూటికి ఏలూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌… ఫ్యాన్‌కు పెద్ద దెబ్బే…?

ప‌వ‌న్ ఎఫెక్ట్‌… ఆమె సీటు మార్చేసిన జ‌గ‌న్‌…?

TDP: మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

sharma somaraju