ఏపి ప్రభుత్వం మత్స్యకారులకు గుడ్ న్యూస్ అందించింది. వైఎస్ఆర్ మత్స్యాకార భరోసా నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. బాపట్లలోని నిజాంపట్నంలో మంగళవారం సీఎం జగన్ బటన్ నొక్కి వైఎస్ఆర్ మత్స్యాకార భరోసా నిధులను మత్స్యకారుల ఖాతాల్లో జమ చేశారు. మొత్తం 1,23,519 మంది మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార భరోసా కింద రూ.123.52 కోట్లతో పాటు ఓఎన్‌జీసీ పైపులైన్ ఏర్పాటుతో జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది మత్స్యకారులకు కూడా రూ.108 కోట్ల ఆర్థిక సాయాన్ని జమ చేశారు. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద వేట నిషేధ భృతిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లుగా ఆర్థిక సాయం అందిస్తోంది.

కాగా ఇప్పటి వరకు లబ్ధిదారులకు రూ.538 కోట్ల సాయం అందింది. ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.10వేల చొప్పున ఏపి ప్రభుత్వం సాయం అందిస్తోంది. ఈ సందర్బంగా సీఎం జగన్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వంలో రూ. 4వేలు.. అది కూడా కేవలం కొందరికి మాత్రమే అందేదని అన్నారు. చంద్రబాబు ఐదేళ్లలో ఇచ్చింది కేవలం రూ.104 కోట్లు మాత్రమేననీ, మన ప్రభుత్వంలో ఒక్క ఏడాదిలోనే రూ. 231 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా గమనించాలని కోరారు. గతంలో 1100 బోట్లు, ఇప్పుడు 20వేల బోట్లకు సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు. గతంలో డీజిల్‌పై రూ.6 ఇస్తే.. ఇప్పుడు రూ.9 సబ్సిడీ ఇస్తున్నామని సీఎం జగన్ వివరించారు.
Breaking: సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి డుమ్మా ..? గడువు కావాలంటూ సీబీఐకి లేఖ
