NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ పోల్‌ రాజ‌కీయాలు

YS Jagan: లోకేశ్ కే కాదు..! సీఎంకి అయినా టంగ్ స్లిప్ కావడం కామనే!!

YS Jagan: రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు అన్న తరువాత వారు తమ ప్రసంగాల్లో ఏదో సందర్భంలో టంగ్ స్లిప్ అవ్వడం కామనే. కాకపోతే వారు మాట్లాడిన మాటల్లో దొరికిన తప్పులను ఎత్తి చూపుతూ ప్రత్యర్థి పార్టీలు ట్రోల్స్ చేస్తుంటారు. ఇంతకు ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన ప్రసంగంలో మంగళగిరి బదులు మందళగిరి అనడం, పరామర్శించడానికి బదులు పరవశించడానికి అంటూ ఇలా టంగ్ స్లిప్ అవ్వడం తెలిసిందే. వైసీపీ సోషల్ మీడియా వింగ్ వెంటనే ఆ మాటల వీడియోలను షేర్ చేసి విమర్శలు చేయడం తెలిసిందే.

YS Jagan tongue slip video goes viral
YS Jagan tongue slip video goes viral

Read more: AP CM YS Jagan: ఎన్నాళ్ల కెన్నాళ్ల కెన్నాళ్లకూ ! జనం లోకి జగన్ ! అదీ ఆనవాయితీకి భిన్నంగా ఆద్యంతం మాస్క్ తో!!

ఇప్పుడు తాజాగా సీఎం వైఎస్ జగన్ టంగ్ స్లిప్ అయి ప్రత్యర్థి సోషల్ మీడియాకు చిక్కారు. ఏపి సీఎం ఓ మహిళ అంటూ సీఎం జగన్ నోరు జారారు. గొల్లపూడిలో మంగళవారం దిశ యాప్ అవగాహన కార్యక్రమంలో జగన్ తడబాటుకు గురయ్యారు. దిశ యాప్ గురించి వివరిస్తూ “ఇంత ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షత్తు ఓ మహిళ కాబట్టి” అన్నారు. వెంటనే పక్కనే ఉన్న హోంమంత్రి మేకతోటి సుచరిత కల్పించుకుని హోమ్ మినిస్టర్ అని గుర్తు చేశారు. దీంతో వెంటనే జగన్ ఆ మాటలను సవరించుకుని ప్రసంగాన్ని కొనసాగించారు. ఆయితే ఈ వీడియోను టీడీపీ..సోషల్ మీడియాలో షేర్ చేసి “ఏమి మాట్లాడుతున్నారు సార్?” అంటూ ట్రోల్ చేస్తున్నారు.

ఇంతకు ముందు కూడా జగన్ తెలుగు పదాలను తప్పుగా ఉచ్చరించిన సందర్భంలోనూ ఇదే విధంగా టీడీపీ నేతలు ఆ వీడియోలను సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన సంగతి విదితమే. లోకేష్ కే కాదు సీఎం జగన్ కు అయినా టంగ్ స్లిప్ కావడం సాధారణమేనని జనాలు అంటున్నారు. ఏదో తడబాటులో నేతలు చేసిన ఉఛ్చారణ దోషాలను పట్టుకుని అదే పనిగా విమర్శలు చేయడం మంచిది కాదంటున్నారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju