NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YS jagan : ఏకగ్రీవం… ఎవరిదో బలం!!

YS jagan : పంచాయతీ ఎన్నికల విషయంలో పంతం నెగ్గించుకున్న లేకపోయినా ఏపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ను ఇరుకున పెట్టేందుకు కొత్త అస్త్రాన్ని బయటకు తీస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం సమాచార శాఖ ఆధ్వర్యంలో పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలు మరోవైపు ఎలక్ట్రానిక్ మీడియాలో ఇస్తున్న ప్రకటనలు చూస్తే ఏకగ్రీవాలు ప్రోత్సహించాలని… సాధ్యమైనంత వరకూ ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం జరిగేలా చూడాలని వైయస్సార్ సిపి నాయకత్వం భావిస్తోంది. దీనికి కూడా ఓ ఈగో కారణమే. ఎలాగూ తమను కాదని ఎన్నికల వరకు వెళ్ళిన ఎలక్షన్ కమిషన్ కు ఎలాంటి పని లేకుండా కేవలం… గెలుపు పత్రాల మీద సంతకం చేసే పని మాత్రమే కల్పించేలా అన్ని పంచాయితీలలో ఎక్కువశాతం ఏకగ్రీవం జరిగేలా వైఎస్ఆర్సిపి నాయకత్వం పావులు కదుపుతున్నట్లు అర్థమవుతోంది. గతంలోనే ఏకగ్రీవాలు మీద అనేక ఆరోపణలు వచ్చాయి. అధికార పార్టీ నాయకులు మిగిలిన వారిని భయభ్రాంతులకు గురి చేసి బెదిరింపులు… బతిమాలి ఆటలతో కావాలనే ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని విమర్శలు అప్పట్లోనే ఎక్కువయ్యాయి. ఇప్పుడు ప్రభుత్వానికి ప్రతిష్ట సమస్య సైతం ఏర్పడడంతో ఈసారి పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు విషయంలోనే ప్రధానమైన గొడవ రానుందని అర్థమవుతుంది.

YS jagan  Unanimity ... Someone's strength !!
YS jagan Unanimity Someones strength

సహెతూకంగా అవుతాయా?

ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఏకగ్రీవాలు లేకుండా పోటీలో ఉండేలా అభ్యర్థులు నిలపాలని నాయకులకు సూచించారు. అయితే గ్రామీణ వాతావరణంలో జరిగే ఎన్నికల్లో ఎంతవరకు ఇది పాటిస్తారు ఎంతవరకు పార్టీ అండగా ఉంటుంది అనేది కీలకం. ఎందుకంటే గ్రామాల్లో ముఖముఖాలు చూసుకున్నారు పరిస్థితిలో లేనిపోని పంతాలు పోవాలని ఎక్కువమంది భావించరు. దీంతోనే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మద్దతు ఎవరి వైపు ఉంటుందో వారివైపు ఏకగ్రీవాలు చేసేందుకు ఈసారి పెద్ద ఎత్తున మంత్రాంగం నడపనున్నారు. ఇది అధికారికంగానే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువ పంచాయతీల్లో ఏకగ్రీవాలు చేసి… రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఎలాంటి పని కల్పించకుండా చేతులు కట్టేసేలా చేసి… దెబ్బకు దెబ్బ తీయాలని అధికార పార్టీ భావిస్తోంది. దీనికి సామ దాన భేద దండోపాయాలను సైతం ఉపయోగించాలని.. ఇప్పటికే పై నుంచి ఆదేశాలు అందాయి. ఇక ఎన్నికల్లో ఏకగ్రీవ లను ఏ పద్ధతిలో చేస్తారు ఎలా చేయబోతున్నారు అనేది ఉత్కంఠ కలిగిస్తోంది.

YS jagan : మరో చట్టం ఇందుకే!

జగన్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరో కీలకమైన చట్టాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తో నే అమలుపరిచేందుకు సమాయత్తమవుతోంది. ఎన్నికల్లో మద్యం డబ్బు పంపిణీ విషయంలో ఈ చట్టం కఠినంగా వ్యవహరించి బోతుంది. మద్యం డబ్బు రవాణా చేస్తూ గాని పంచుతూ గాని పట్టు పడితే వారిని ఎన్నికల్లో బహిష్కరించే లా ఈ చట్టం తోడ్పాటునందిస్తుంది. గతంలోనే మద్యం డబ్బు పంపిణీ విషయంలో అనేకమైన భిన్నాభిప్రాయాలు… అనేక దొంగ కేసులు బనాయింపు మీద ప్రతిపక్షాలు రచ్చ చేశాయి. ఇప్పుడు ఈ కొత్త చట్టం పేరు చెప్పి ప్రతిపక్ష పార్టీల తరఫున లేదా పోటీలో ఉన్న వారి మీద మద్యం డబ్బు పంపిణీ విషయంలో ఇష్టానుసారం కేసులు పెట్టేందుకు ప్రభుత్వం ఈ చట్టం తీసుకువచ్చింది అనేది ప్రతిపక్షాల ఆరోపణ. సామ దాన భేద దండోపాయాలు సైతం పూర్తయితే… ఏకగ్రీవ ల కోసం ఈ కొత్త చట్టాన్ని చూపించి భయపెట్టి అధికార పక్షానికి అనుకూలంగా ఫలితాలు తీసుకురావాలనే ది జగన్ ప్రభుత్వం ప్రధాన ఆలోచన అనేది విమర్శ. మరి దీనిని పోలీసు యంత్రాంగం పంచాయతీ ఎన్నికల్లో ఎంతమేర ప్రయోగిస్తుంది? ఎవరి మీద ప్రయోగిస్తుంది?? అధికార పార్టీ నాయకులు చెప్పినట్లే ఈ చట్టం నడుచుకొనుందా?? ఈ కొత్త చట్టాలు, ఏకగ్రీవ ప్రకటన మొత్తం రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీద ప్రభుత్వం తీసుకోబోయే కక్ష సాధింపు చర్యలా? అనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. అయితే ఎంతో ఉత్కంఠ రేపుతూ జరుగుతున్న ఎన్నికల్లో కచ్చితంగా అధికార పార్టీ అన్ని స్థానాలను గెలుచుకొని రాష్ట్ర ఎన్నికల కమిషన్కు తన బలాన్ని నిరూపించుకోవడానికి ఒక సమయం మాత్రం కచ్చితంగా ఇదే అన్నది వైఎస్ఆర్సిపి పార్టీ అభిమానుల కోరిక.

author avatar
Comrade CHE

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju