NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila : నియోజకవర్గ స్థాయి కమిటీలపై దృష్టి పెట్టిన షర్మిల

YS Sharmila focused on constituency party committees : తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించేందుకు డిసైడ్ అయిన  దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల వైఎస్ఆర్ అభిమానులు, యువత, విద్యార్థి సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్న షర్మిల జిల్లాల స్థాయిలో ముగ్గురితో కమిటీలను నియమించారు. ఇప్పుడు తాజాగా నియోజకవర్గ స్థాయి కమిటీల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. షర్మిల పెట్టబోయే పార్టీ పేరు ఇంత వరకు ఖరారు కాలేదు కానీ రెండు మూడు ప్రచారంలో ఉన్నాయి. త్వరలో పార్టీ పేరు, జెండా, జెండా రంగులు తదితర విషయాలు వెల్లడించనున్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకునేందుకు తెలంగాణ వ్యాప్తంగా  పాదయాత్ర చేయాలని కూడా షర్మిల నిర్ణయించుకున్నారు.

YS Sharmila focused on constituency party committees
YS Sharmila focused on constituency party committees

పార్టీ బలోపేతానికి జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి కమిటీలే కీలకం. ముందుగా జిల్లా స్థాయి కమిటీలను నియమించిన షర్మిల ఇప్పుడు నియోజకవర్గ స్థాయి కమిటీలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో భాగంగా గురువారం లోటస్ పాండ్ లో ముఖ్య అనుచరులతో సమావేశమైయ్యారు. ఆనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. పార్టీ బలోపేతానికి కమిటీలే కీలకమని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు కమిటీ సభ్యులను ఎంపిక చేస్తామని తెలిపారు. కమిటీ వ్యవహారాల బాధ్యతను పిట్టా రాంరెడ్డికి అప్పగించామన్నారు. ఈ నెల 16వ తేదీలోగా కమిటీల నియామకం పూర్తి చేస్తామని షర్మిల తెలిపారు.

పార్టీ నిర్మాణంపై దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరులు, సన్నిహితులతో షర్మిల సమావేశాలను నిర్వహిస్తూ వారి అభిప్రాయాలను తీసుకుంటున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నారు. వైఎస్ఆర్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు ప్రజలకు అందడం లేదనీ, ప్రజలు సంతోషంగా లేరని పేర్కొంటున్నారు. నాటి రోజులు తీసుకురావాలన్నదే తన అభిలాషగా షర్మిల ముందుకు సాగుతున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju