21.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: వైఎస్ వివేకా హత్య పై వైఎస్ షర్మిల కీలక కామెంట్స్

Share

YS Sharmila:  తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తుపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ఈ హత్య తమ కుటుంబంలో జరిగిన ఘోరమనీ, వివేకా కుమార్తె సునీతారెడ్డి కి న్యాయం జరగాలని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో వైఎస్ షర్మిల బిజీబిజీ గా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసిఆర్ సర్కార్ అవినీతిపై విచారణ జరిపించాలంటూ ఇంతకు ముందు సీబీఐ డైరెక్టర్ ను కలిసిన షర్మిల తాజాగా కంట్రోలర్ ఆడిట్ జనరల్ (సీఏజీ) కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీకి చేరుకున్న షర్మిల ను వివేకా హత్య కేసు దర్యాప్తుపై మీడియా ప్రతినిధులు ఫ్రశ్నించగా కీలక వ్యాఖ్యలు చేశారు.

YS Sharmila

 

వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సుప్రీం కోర్టు వేరే రాష్ట్రానికి బదిలీ చేయడం మంచిదని ఆమె పేర్కొన్నారు. ఆ హత్య తమ కుటుంబంలో జరిగిన ఘోర ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా కుమార్తె సునీతారెడ్డికి న్యాయం జరగాలన్నారు. మా చిన్నాన్న ను అంత ఘోరంగా ఎవరు హత్య చేశారు అనేది బయటకు రావాలి, వారికి శిక్ష పడాలి అని అన్నారు. హత్య కేసు దర్యాప్తును ఎవరూ అడ్డుకోవడానికి వీల్లేదని పేర్కొన్నారు. వివేకా హత్య కేసుకు రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయేమో అన్న అంశాలు సీబీఐ దర్యాప్తులో తేలిపోతాయని షర్మిల వ్యాఖ్యానించారు.

వివేకా కుమార్తే సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై వివేకా హత్య కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీం కోర్టు అంగీకరించిన సంగతి తెలిసిందే. కేసు దర్యాప్తులో తీవ్ర జాప్యం జరుగుతున్న నేపథ్యంలో సునీతారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

CM YS Jagan: అందుకే ఆ హామీ నెరవేర్చలేకపోయా.. పోలీసు కుటుంబాలకు సంజాయిషీ ఇచ్చుకున్న సీఎం జగన్


Share

Related posts

Rajamouli : రాజమౌళి అడిగితే ప్రభాస్ – అనుష్క కాదంటారా..?

GRK

అమిత్ షా తో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ … టీ కాంగ్రెస్ పై కీలక వ్యాఖ్యలు

somaraju sharma

Naga chaithanya: బంగార్రాజుగా నాగ చైతన్య ఫస్ట్‌లుక్ టీజర్.. అక్కినేని ఫ్యాన్సే షాకింగ్ కామెంట్స్..!

GRK