YS Sharmila: కొత్త రూట్లో వ‌స్తున్న ష‌ర్మిల‌… కేసీఆర్ దొర ఇలా చేయ్‌

Share

YS Sharmila: తెలంగాణ‌లో రాజ‌కీయ అరంగేట్రం చేయ‌డం, త‌న టీం బ‌లోపేతం చేసుకోవ‌డంలో బిజీగా ఉన్న వైఎస్ ష‌ర్మిల ఈ మేర‌కు ప‌క‌డ్బందీగా ముందుకు సాగుతున్నారు. తెలంగాణలో వెంటనే 1.91లక్షల ఉద్యోగాలను నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ వైఎస్ ష‌ర్మిల ఉద్యోగ దీక్షకు చేసిన సంగ‌తి తెలిసిందే. దీనికి కొన‌సాగింపుగా వైఎస్ ష‌ర్మిల తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై సోష‌ల్ మీడియా వేదిక నిల‌దీశారు.

దొర అంటూ…

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆది నుంచి ష‌ర్మిల‌ డిమాండ్ చేస్తూ వ‌స్తున్నారు. క‌రోనా వైద్యం కోసం ప్ర‌భుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల‌ను భ‌ర్తీ చేయ‌డం కోసం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంపై ట్విట్ట‌ర్‌లో స్పందించిన ఆమె కాంట్రాక్టు కాదు దొర‌.. ప‌ర్మినెంట్ రిక్రూట్‌మెంట్ చేయ్ అంటూ తెలంగాణ యాస‌లో కేసీఆర్‌పై సెటైర్లు వేశారు. 755 అంటూ కొస‌ర‌కు కేసీఆర్ దొర‌… హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న 23,512 ఖాళీ పోస్టుల‌ను నింపు జ‌ర అని వ్యాఖ్యానించిన ఆమె.. అలా చేస్తే.. నిరుద్యోగుల చావుల‌ను కొంత‌మేర‌కైనా ఆప‌వ‌చ్చు అని స‌ల‌హా ఇచ్చారు.

ఇప్ప‌టికే కీల‌క ప్ర‌క‌ట‌న‌

కాగా , గ‌తంలో ష‌ర్మిల ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయంలో నలభై లక్షమంది నిరుద్యోగులున్నారని పేర్కొన్న ఆమె మానసికంగా రోజు చనిపోతున్నారు. ఉద్యోగాలు రావడం లేదని ఆత్మహత్యలు చేసుకున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ‌లో ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు వ‌చ్చేంత వ‌ర‌కు పోరాటం చేస్తూనే ఉంటాన‌ని వైఎస్ ష‌ర్మిల‌ ప్ర‌క‌టించారు. ఒక వేళ కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వ‌క‌పోతే రెండేళ్ల‌లో త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని అప్పుడు ప్ర‌భుత్వ ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌డ‌మే కాదు.. ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగాలు సృష్టిస్తామ‌ని హామీ ఇచ్చారు.


Share

Related posts

TDP టీడీపీ బలగం మొత్తం తిరుపతిలోనే..! ఫలితం ఎలా ఉండొచ్చు.!?

Srinivas Manem

Tirupathi By Poll: ఒంటిగంట వరకు శాతం పోలింగ్ ఇలా..! దొంగ ఓట్ల కలకలం..!!

Srinivas Manem

బిగ్ బాస్ 4: ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు చీఫ్ గెస్ట్..??

sekhar