ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Viveka Case: బ్రేకింగ్ : వై ఎస్ వివేకా కేసులో కీలక నేత అరెస్ట్ ??

Share

YS Viveka Case: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు క్లైమాక్స్ కు చేరింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అధికారులు ఇప్పటికే ప్రధాన నిందితుల (పాత్రధారులు)ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు నిందితుల్లో ఒకరు అప్రూవర్ గా మారడంతో సీబీఐకి దర్యాప్తు ఈజీ అయ్యింది. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో సూత్రధారుల పాత్రపై అధారాలను సేకరించారు. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని అయిదవ నిందితుడుగా అరెస్టు చేసింది సీబీఐ.

YS Viveka Case CBI Arrest key leader soon
YS Viveka Case CBI Arrest key leader soon

త్వరలో ప్రముఖులను అరెస్టు

రీసెంట్ గా దేవిరెడ్డి శివశంకరరెడ్డి కడప కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా సీబీఐ కీలక విషయాలను వెల్లడించింది. ప్రస్తుతం ఈ కేసులో కీలక సమయమనీ, నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొనడంతో పాటు తాము కొందరు ప్రముఖులను అరెస్టు చేయనున్నట్లుగా తెలిపింది. సాధారణంగా బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయంటూ అపోజ్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు కొందరు ప్రముఖులను అరెస్టు చేయనున్నామనీ, హత్య కేసు విషయంలో ఇది కీలక సమయం అని పేర్కొనడం విశేషం.

నోటీసులు అందజేత..?

మరో పక్క ఈ కేసులో ఇద్దరు ప్రముఖులకు సీబీఐ నోటీసులు కూడా జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే విచారణ చేసి పంపుతారా..? వెంటనే అరెస్టు చేసి కోర్టుకు హజరు పరుస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది. సీబీఐ కోర్టుకు నివేదించిన దాన్ని బట్టి చూస్తే ఏ క్షణమైనా ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆ ఇద్దరిని అరెస్టు చేసే అవకాశం ఉందంటూ మీడియాలో ప్రచారం జరుగుతోంది.


Share

Related posts

టాలీవుడ్ లో ప్రభాస్ కి పోటీగా పాన్ ఇండియన్ లెవల్ లో దూసుకొస్తున్న హీరో అతనేనా ..?

GRK

Breaking : ఆడపిల్లల కోసం యూజీసీ స్పెషల్ స్కాలర్ షిప్.. అప్లై చేసుకోండిలా.. !

amrutha

మహీంద్రా.. టీవీఎస్ కలవనున్నాయా..!? ఇది కీలక అంశమే..!!

bharani jella