NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Viveka Case: వైసీపీ వ్యతిరేక మీడియాకు ఫుల్ స్టఫ్ దొరికినట్లు..? వివేకా హత్యపై పాత వార్తకు కొత్త మేకప్..!!

YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తన దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన పాత్రదారులు (నేరం చేసిన వారుగా భావిస్తున్న) ఎవరు అనేది తెలుసుకుంది. ఆ పాత్రదారులలో కొందరిని అరెస్టు చేసి జైలుకు పంపించింది. వివేకా హత్యలో ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకరరెడ్డి, యాదటి సునీల్ కుమార్ యాదవ్, గజ్జల ఉమా శంకరరెడ్డి, షేక్ దస్తగిరిల ప్రమేయంపై పులివెందుల కోర్టులో సీబీఐ గతంలోనే చార్జిషీటు దాఖలు చేసింది. ఈ నేరంలో పాలుపంచుకున్న వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారి న్యాయమూర్తి సమక్షంలో వ్యాంగ్మూలం ఇవ్వడంతో ఆయనకు క్షమాబిక్ష ప్రకటించి అతన్ని ఈ కేసులో సాక్షిగా పేర్కొంది సీబీఐ.

YS Viveka Case updates
YS Viveka Case updates

శివశంకర్ రెడ్డి అరెస్టుతో…

అప్రూవర్ గా దస్తగిరి ఇచ్చిన స్టేట్ మెంట్ కాపీలను కోర్టు ఆదేశాల మేరకు నిందితుల తరపున న్యాయవాదులకు గతంలోనే అందజేశారు. అప్పుడు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు బయటకు వెలువడ్డాయి. రూ.40 కోట్ల డీల్ తో వివేకా హత్య జరిగిందనీ, దీని వెనుక ఎవరెవరు ఉన్నారు అనేది దస్తగిరి ఆ స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు. అయితే ఈ కేసులో కడప ఎంపి అవినాష్ రెడ్డి ముఖ్య అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసి జైలుకు తరలించడంతో దీని వెనుక ఆయన ప్రమేయం కూడా ఉందని అనుమానాలు వస్తున్నాయి. సీబీఐ కూడా వివేకా హత్య వెనుక ఉన్న భారీ కుట్రను వెలికితీసే దిశగా దర్యాప్తును కొనసాగిస్తోంది.

YS Viveka Case: కుట్రదారుల పాత్రపై ఆధారాల సేకరణలో

అయితే సీబీఐ గతంలో పులివెందుల కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్ లోని వివరాలు ఇప్పుడు బహిర్గతం కావడంతో వైసీపీ వ్యతిరేక మీడియాలో కొత్తగా వెలుగులోకి వచ్చినట్లుగా ఈ అంశాలను హైలెట్ చేస్తూ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఈ కేసును తప్పుదోవపట్టించేందుకు నిందితులు వెనుక ఉన్న కొందరు సీబీఐ అధికారులపైనే ఆరోపణలు చేయడం లాంటి చర్యలు చేపట్టినా సీబీఐ మాత్రం కుట్రదారుల పాత్రపై ఆధారాల సేకరణలో నిమగ్నమై దర్యాప్తును కొనసాగిస్తోంది. వివేకా హత్య కేసులో 40 కోట్ల డీల్, ఘటనా స్థలంలో ఆధారాలు చెరిపివేయడం, దాని వెనుక ఎవరు ఉన్నారు అనే విషయాలు అన్నీ గతంలోనే మీడియాలో వచ్చాయి. కొత్త సీసాలో పాత సారా అన్నట్లుగా సీబీఐ చార్జిషీటు అంటూ నేడు పాత కథనాలనే కొత్తగా హైలెట్ చేయడం గమనార్హం.

author avatar
sharma somaraju Content Editor

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N