మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తెలంగాణకు బదిలీ అయిన తర్వాత తొలి సారిగా హైదరాబాద్ ని సీబీఐ కోర్టులో నేడు విచారణ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో కడప జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలను ప్రత్యేకంగా పోలీసు బందోబస్తు నడుమ ఈ తెల్లవారుజామున హైదరాబాద్ కు తరలించారు. ఇప్పటికే బెయిల్ పై ఉన్న ఎర్ర గంగిరెడ్డి, డ్రైవర్ దస్తగిరిలు హైదరాబాద్ కు చేరుకున్నారు. నిందితులను ఈ రోజు ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ సీబీఐ కోర్టు లో హజరుపర్చనున్నారు.

అయితే కోర్టులో హజరైన తర్వాత ముగ్గురు నిందితులను తిరిగి కడప జైలుకు తీసుకువెళ్తారా లేక చంచల్ గూడ జైలుకు తరలిస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సీబీఐ కోర్టు న్యాయమూర్తి నిర్ణయంపై ఆ విషయం ఆధారపడి ఉంటుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేసు విచారణ ఏపి నుండి తెలంగాణకు బదిలీ అయిన సంగతి తెలిసిందే. కేసు విచారణ హైదరాబాద్ సీబీఐ కోర్టులో జరగనున్న నేపథ్యంలో ప్రతి సారి నిందితులు కోర్టుకు హజరుకావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి .. నిందితులను ఎక్కడికి తరలించనున్నారనే ఆందోళన నిందితుల కుటుంబ సభ్యుల్లో ఉంది. నిందితులు కడప జైలులో ఉంటే నెలకు ఒక సారో రెండు సార్లు వారి కుటుంబ సభ్యులు ములాఖత్ వెళుతుంటే వారు. హైదరాబాద్ చంచల్ గూడ కు జైలుకు తరలిస్తే నిందితుల కుటుంబ సభ్యులకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. చూడాలి ఏమి జరుగుతుందో..?
రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం