CBI Court: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ కోర్టు ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో విచారణకు గానూ జ్యూడిషియల్ ఖైదీలుగా ఉన్న సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ లను పోలీసులు తీసుకువచ్చి సీబీఐ కోర్టులో హజరుపర్చగా, మరో ఇద్దరు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిలు కోర్టుకు హజరైయ్యారు. విచారణ అనంతరం జ్యూడిషియల్ ఖైదీలను చంచల్ గూడా జైలుకు తరలించారు పోలీసులు. న్యాయమూర్తి ఈ కేసును మార్చి 31వ తేదీకి వాయిదా వేశారు.

మరో పక్క వైసీపీ ఎంపి అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. సీబీఐ తీవ్ర చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు అవినాష్ రెడ్డి, సీబీఐ దర్యాప్తుపై ఆరోపణలు చేస్తూ అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కాగా ఈ పిటిషన్లో ఇంప్లీడ్ అయ్యేందుకు అనుమతించాలంటూ వివేకా కుమార్తె సునీత కోర్టును అభ్యర్ధించారు. దీనిని కోర్టు అనుమతించింది. సీబీఐకి ఎంపి అవినాష్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారనీ, ఇప్పటికే రెండు సార్లు సీబీఐ విచారణకు హజరైయ్యారని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
అవినాష్ రెడ్డి స్టేట్ మెంట్ల ఆడియో, వీడియోలను రికార్డు చేయలేదని న్యాయవాది తెలిపారు. ఆయన సంతకం కూడా తీసుకోలేదన్నారు. ఈ రెండు స్టేట్ మెంట్ లను పక్కన పెట్టాలని అభ్యర్ధించారు. విచారణ అధికారి దర్యాప్తును పారదర్శకంగా చేయడం లేదనీ, వివేకా హత్య కేసులో ఆయన అల్లుడు రాజశేఖరరెడ్డిపైనే అనుమానాలు ఉన్నాయనీ, ఆ దిశగా దర్యాప్తు జరగడం లేదని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దర్యాప్తు అధికారిపై అభియోగాలు ఉన్నందున మొత్తం రికార్డులను సోమవారం కోర్టు ముందు ఉంచాలని సీబీఐని ఆదేశించింది హైకోర్టు.
YS Viveka Murder Case: సస్పెన్స్‌కు తెరదించి సీబీఐ కార్యాలయానికి చేరుకున్న ఎంపీ అవినాష్ రెడ్డి