NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

YS Viveka Murder Case: వివేకా కేసులో కోర్టు ముందుకు రెండో వ్యక్తి ..! కోర్టు హాలులో సెన్షేషనల్ కామెంట్లు..?

YS Viveka Murder Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దొంగ పోలీసు ఆట ఆడుతున్నట్లు కనబడుతోంది. ఈ హత్య కేసు పరిశోధనలో సీబీఐ వ్యవహరిస్తున్న తీరు బాగుందా? సక్రమంగా వెళుతుందా? దారి తప్పుతుందా?  అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇంతకు ముందే ఈ కేసులో నైట్ వాచ్ మెన్ రంగన్నను సీబీఐ అదుపులోకి తీసుకుని కోర్టులో వాగ్మూలం ఇప్పించింది. అలాగే నిన్న వివేకా వద్ద పని చేసిన మాజీ డ్రైవర్ దస్తగిరి ప్రసాద్ ను కూడా కోర్టుకు హజరుపర్చి వాగ్మూలం ఇప్పించారు. దాదాపు అయిదు గంటల పాటు ఇది జరిగింది. వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా రెండవ వ్యక్తితో కోర్టులో వాగ్మూలం ఇప్పించారు.

YS Viveka Murder Case cbi enquiry
YS Viveka Murder Case cbi enquiry

ఇంతకు ముందే  వైసీపీ కార్యకర్త సునీల్ కుమార్ యాదవ్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. దాదాపు మూడు నెలలుగా సీబీఐ నాల్గవ దశ దర్యాప్తులో ఇప్పటికి 160 మందిని విచారించింది. అయితే 160 మందిలో సీబీఐ డైవర్ దస్తగిరి, నైట్ వాచ్ మెన్ రంగన్న, కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లా, సునీల్ కుమార్ యాదవ్, పిఏ జగదీశ్వరరెడ్డి, ప్రసాద్ రెడ్డి ల చుట్టే సీబీఐ తిరిగింది. అంటే డ్రైవర్, వాచ్ మెన్, కంప్యూటర్ ఆపరేటర్ ఇలా దిగువ స్థాయి వాళ్ల చుట్టూనే సీబీఐ తిరుగుతోంది. అలానే కడప ఎంపి అవినాష్ రెడ్డి పీఏలను కూడా సీబీఐ విచారించింది. అదే విధంగా అవినాష్ రెడ్డి తండ్రి బాస్కరరెడ్డిని కూడా సీబీఐ ఒక రోజు విచారించింది. కానీ నైట్ వాచ్ మెన్ ని, ఇంటి పని మనిషిని, డ్రైవర్  ను, కార్యకర్తలను రోజుల తరబడి, నెలలు తరబడి పిలిపించి విచారించారు. ఎంపి పీఏలను మాత్రం రెండు రోజులు మాత్రమే విచారించారు. బాస్కరరెడ్డిని కూడా ఒక రోజే విచారించారు.

ఇంతకు సీబీఐ ఈ కేసులో ఏమి చేయబోతున్నది అనేది ఓ పెద్ద మిస్టరీగా ఉంది. అరెస్టు చేసిన సునీల్ కుమార్ యాదవ్ ఏమో తనను బలవంతంగా కేసులో ఇరికిస్తున్నారు, తనకు ఈ కేసుకు సంబంధం లేదు అంటూ గగ్గోలు పెడుతున్నాడు. వాస్తవానికి ఏవరైనా అదే చెబుతారు అనుకోండి. అయితే సునీల్ కుమార్ యాదవ్ కోర్టులో పిటిషన్ కూడా వేశాడు. నన్ను ఇరికిస్తున్నారు అని. అతని కుటుంబం కూడా సీబీఐ మీద సంచలన ఆరోపణలు చేసింది. సీబీఐ దారి తప్పింది, పెద్దోళ్లను వదిలివేసి మా మీదకు వచ్చింది, మాకు ఏమి అవసరం ఆయనను చంపాల్సిన అవసరం, దీనిలో పెద్దపెద్దోళ్లు ఉన్నారు అని సునీల్ కుమార్ యాదవ్ కుటుంబం చెబుతోంది. దిగువ స్థాయి వాళ్లను పట్టుకుంటుంటే పెద్దోళ్లను అదుపులోకి తీసుకోవడం కోసం ఎర వేస్తుందేమో అని భావిస్తూ వస్తున్నారు. పెద్ద పెద్దోళ్లను అరెస్టు చేసేందుకు గానూ ఈ చిన్న చిన్న వాళ్లను పట్టుకుని స్టేట్ మెంట్ లు రికార్డు చేయిస్తూ ఎర వేస్తుందేమో అని అందరూ అనుకుంటున్నారు.

 

వివేకానంద రెడ్డి చంపాల్సిన అవసరం ఈ చిన్న చిన్న వాళ్లకు అవసరం లేదు అన్నది అందరికీ తెలిసిందే. అది సీబీఐకీ కూడా తెలుసు. ఒక వేళ వీళ్లు చేశారు అంటే వీళ్ల వెనుక ఎవరో ఉండి చేయించి ఉంటారు.  ఆ చేయించిన వాళ్లు ఎవరు అనేది సీబీఐ తేల్చాల్సి ఉంది. అయితే అది తేల్చకుండానే సీబీఐ దొంగ పోలీసు అట ఆడుతోంది. 90 రోజుల నుండి సీబీఐ కడప, పులివెందులలోనే తిష్టవేసి విచారణ కొనసాగిస్తోంది. రానున్న పది ఇరవై రోజుల్లో ప్రధానంగా ఈ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పిలిపించి అరెస్టు చేస్తుందో లేదో చూడాలి. ఒక వేళ సిబీఐ ఈ కేసులో తప్పుదారి పట్టి దిగువ స్థాయి వాళ్లనే అరెస్టుకు పరిమితం చేసి చార్జిషీటు దాఖలు చేస్తే గనుక రెండు తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ ప్రతిష్ట మసకబారుతుంది.

1.Eenadu Cartoonist Sridhar: రామోజీ కోటకి బీటలు..!? కార్టూనిస్ట్ శ్రీధర్ వెళ్లడం వెనుక కీలక కారణాలు..!!

2.AP High Court: రాజధాని రైతులకు గుడ్ న్యూస్..! ఆ జీవో కొట్టివేతతో షాక్..!!

3.Huzurabad By poll: రూటు మార్చిన కాంగ్రెస్ ..! ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థి ఎంపిక..! కొండా సురేఖకు నో ఛాన్స్..!!.

 

author avatar
Srinivas Manem

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju