YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా ( వివేకానంద రెడ్డి) హత్య కేసులో దర్యాప్తు జరుపుతున్న సీబీఐ మరల దూకుడు పెంచింది. గత కొన్ని నెలలుగా దర్యాప్తు మందకొడిగా సాగిస్తున్న సీబీఐ .. మరల విచారణ ముమ్మరం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో వివేకా కేసును తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేసిన సంగతి తెలిసిందే. హతుడు వివేకా కుమార్తె డాక్టర్ సునీత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఆ మేరకు కీలక ఉత్తర్వులు ఇచ్చింది.

ఇవేళ పులివెందుల్లో వైఎస్ భాస్కరరెడ్డి నివాస పరిసర ప్రాంతాలను సీబీఐ అధికారుుల పరిశీలించారు. మరో పక్క కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. రేపు (మంగళవారం) ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి విచారణకు హజరు కావాలని సీబీఐ ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించనున్నది.
గత ఎన్నికలకు ముందు 2019 మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి ని ఆయన నివాసంలోనే దారుణంగా హత్య చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయిన ఈ కేసు నాటి నుండి ఏన్నో మలుపులు తిరిగింది. తొలుత గత ప్రభుత్వ హయాంలో సిట్ దర్యాప్తు జరగా, వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ సిట్ ను రద్దు చేసి మరో సిట్ ఏర్పాటు చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ వివేకా కుమార్తె హైకోర్టును ఆశ్రయించగా, విచారణ జరిపిన కోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చింది.
సీబీఐ అధికారులు వందలాది మందిని విచారణ జరిపి పలువురు దోషులను అరెస్టు చేశారు. ఈ కేసులో మూడవ నిందితుడుగా ఉన్న వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే కేసు దర్యాప్తు జరుపుతున్న సీబీఐ అధికారులపైనే ఆరోపణలు చేయడం, వారిపైనే ఎఫ్ఐఆర్ నమోదు కావడం తీవ్ర సంచలనం అయ్యింది. తాజాగా ఈ కేసులో విచారణకు హజరుకావాలంటూ ఎంపి అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
AP High Court: జీవో నెం.1 పై విచారణ రేపటికి వాయిదా.. అత్యవసర విచారణ జరపడంపై సీజే ఘాటు వ్యాఖ్యలు