YS Viveka Murder Case: వివేకా కేసులో మరో ట్విస్ట్..! ఏపీ హైకోర్టులో గంగిరెడ్డి పిటిషన్ విచారణ..!!

Share

YS Viveka Murder Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనేక ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) పైనే అనుమానాల వ్యక్తం చేస్తున్నారు. వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని సీబీఐ అధికారులు అరెస్టు చేయకుండా క్షమాబిక్ష పెట్టడాన్ని సవాల్ చేస్తూ ఎర్ర గంగిరెడ్డి హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేయగా, మంగళవారం కోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. దస్తగిరికి సీబీఐ క్షమాభిక్ష పెట్టడం క్షమార్హం కాదు, న్యాయమూర్తి ముందు 164 స్టేట్ మెంట్ ఇస్తే దాన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటారు. కేసులో నిందితుడుగా పేర్కొన్న వ్యక్తిని అరెస్టు చేయకుండా వదిలివేయడం ఐపీసీ సెక్షన్లను ఉల్లంఘించడమేనని వాదనలు వినిపించారు. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ సమయం కోరింది. సీబీఐ కౌంటర్ దాఖలు చేసిన ఈ అంశాలను పరిశీలించి ఒక నిర్ణయాన్ని వెల్లడిస్తామని ధర్మాసనం తెలియజేసింది. కౌంటర్ దాఖలునకు సీబీఐకి సమయం ఇస్తూ తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.

YS Viveka Murder Case hearing ap high court
YS Viveka Murder Case hearing ap high court

YS Viveka Murder Case: ప్రాణహాని ఉందంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు

వివేకా హత్య కేసులో నిందితుడైన మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారి కన్ఫెషన్ స్టేట్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అతను ఇచ్చిన స్టేట్ మెంట్ లో ఎర్ర గంగిరెడ్డి పేరును బయటపెట్టారు. అయితే తనను కావాలనే హత్య కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఎర్ర గంగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఎర్ర గంగిరెడ్డిని గతంలోనే ఘటనా స్థలంలో సాక్షాధారాలు మాయం చేశారన్న అభియోగంపై అప్పటి సిట్ అధికారులు అరెస్టు చేశారు. మూడు నెలల వరకూ సిట్ అధికారులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేయకపోవడంతో మూడు నెలల తరువాత ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పై విడుదల అయ్యారు. అయితే ఇటీవల గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కడప సెషన్స్ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన కోర్టు సిబీఐ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో గంగిరెడ్డికి ఊరట లభించింది. మరో పక్క వివేకా పీఏ కృష్ణారెడ్డి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరుతూ కడప జిల్లా ఎస్పీని ఆశ్రయించారు.  వివేకా కుమార్తె సునీతా రెడ్డి, వాళ్ల మనుషుల నుండి తనకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కృష్ణారెడ్డి కూడా వివేకా హత్య కేసులో నిందితుడుగా ఉన్నారు. వివేకా హత్య కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుని నిందితులను అరెస్టు చేస్తున్న క్రమంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు వెలుగు చూస్తున్నాయి.


Share

Related posts

KCR: కరోనా నుండి కాపాడాలని కేసీఆర్ కి సొంత పార్టీ వారి మొర!దొర గారు ఇప్పుడేమంటారో?

Yandamuri

కొరియా డాక్టర్లు కరోనాపై ఆసక్తికర విషయాలు బయట పెట్టారు

Siva Prasad

బ్రేకింగ్ : నిన్న నిర్ణయం… నేడు ఈవెంట్!  జగన్ స్పీడ్ మామూలుగా లేదు

arun kanna