NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ టాప్ స్టోరీస్ న్యూస్

YS Viveka: పెద్దలు దొరికినట్లే – దస్తగిరి అప్రూవర్ అయితే ఏమి జరుగుతుంది..? వివేకా కేసులో పెద్ద మలుపు ఇది..!!

YS Viveka: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఓ కీలక అడుగు పడింది. ఈ హత్య కేసులో నాల్గవ నిందితుడుగా ఉన్న షేక్ దస్తగిరి అప్రూవర్ గా మారేందుకు కడప సబ్ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ కేసులో ఇన్నాళ్లుగా ఉన్న చిక్కు ముడులు వీడిపోయే అవకాశం ఉంది. దస్తగిరి అప్రూవర్ గా ఇచ్చిన స్టేట్ మెంట్ తో ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డితో పాటు ఆయన వెనుక మరి కొందరు ఉన్నారు అనేది బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దస్తగిరి స్టేట్ మెంట్ తోనే కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి అత్యంత సన్నిహితుడు శివశంకర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. అయితే ఇక్కడ దస్తగిరి ఇన్నాళ్లు చెప్పింది వేరు. ఇప్పుడు జరుగుతున్న విచారణ వేరు. ఎందుకంటే ఆయన అప్రూవర్ గా మారిపోయాడు. ఇన్నాళ్లు దస్తగిరి కేసులో ముద్దాయిగా ఉన్నారు. ఇప్పుడు కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆయన నిందితుడు స్థానం నుండి సాక్షి స్థానంలోకి వచ్చారు. ఇదే ఈ కేసులో కీలకం. కేసుల్లో ముద్దాయి చెప్పే విషయాలకు విలువ ఉండదు. కానీ సాక్షి చేస్తే విషయాలకు కోర్టులో విలువ ఉంటుంది.
YS Viveka murder case key updates
YS Viveka murder case key updates

YS Viveka: మరో సారి దస్తగిరి వాగ్మూంలం

ఏ 4 నిందితుడు దస్తగిరి అప్రూవర్ గా మారుతున్నాడనీ 306 సెక్షన్ కింద సాక్షం నమోదు చేయాలని కడప సబ్ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఇతర ముగ్గురు నిందితుల తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. సీబీఐ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం దస్తగిరి అప్రూవర్ పిటిషన్ కు అనుమతి ఇచ్చింది. సాక్షిగా దస్తగిరి స్టేట్ మెంట్ నమోదు చేయాలని పులివెందుల కోర్టును సబ్ కోర్టు ఆదేశించింది. దీంతో దస్తగిరి సాక్షిగా తాను చేసింది, తాను చూసింది కోర్టుకు చెప్పనున్నారు. ఆయన చెప్పిన విషయాలను ముద్దాయి చెప్పినట్లుగా కాకుండా సాక్షి చెప్పినట్లుగా కోర్టు నమోదు చేస్తుంది. ఈ కేసులో గతంలో దస్తగిరి చెప్పిన వాగ్మూలం ఆధారంగా ఎర్ర గంగిరెడ్డి, ఇటీవల సీబీఐ అరెస్టు చేసిన శివశంకర్ రెడ్డిలు కీలక నిందితులు కాబోతున్నారు. వీళ్లిద్దరిలో ఇప్పటికే శివ శంకర్ రెడ్డిని శుక్రవారం కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. ఒక పక్క దస్తగిరి స్టేట్ మెంట్ రెడీ అవుతోంది. కడప కేంద్ర కారాగారంలోని గెస్ట్ హౌస్ లో  శివశంకర్ రెడ్డిని సీబీఐ విచారణ జరుపుతోంది. పులివెందుల కోర్టు శివశంకరరెడ్డిని ఏడు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ విచారణ సాగుతోంది. సీబీఐ విచారణలో శివశంకర్ రెడ్డి చెప్పే విషయాలు కీలకం కానున్నాయి. ఇంకా తెరవెనుక ఎవరు ఉన్నారు అనేది వెల్లడి అయ్యే అవకాశాలు ఉంటాయి.

ఈ హత్య కేసులో మరో నిందితుడు ఏ 1 గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని 20 రోజుల క్రితం కడప నాల్గవ అదనపు జిల్లా కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కోర్టు శుక్రవారం విచారణ జరిపి 29వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిసింది. ఇక సీబీఐ దస్తగిరి స్టేట్ మెంట్ ను పులివెందుల కోర్టులో రికార్డు చేయించడం, శివశంకరరెడ్డి విచారణలో వెల్లడించే విషయాలతో వివేకా హత్య కేసులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది అనేది సీబీఐ గుర్తించే అవకాశం ఉంది. అదే విధంగా ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుకు కోర్టు అంగీకరిస్తే ..ఆయనను కస్టడీకి తీసుకుని దస్తగిరి చెప్పిన విషయాల ఆధారంగా ఆయనను సీబీఐ ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. వివేకా హత్య కేసులో వేగంగా జరుగుతున్న ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే మరో వారం రోజుల్లో కీలక వ్యక్తుల అరెస్టు కూడా ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది.

author avatar
Srinivas Manem

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!