NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

YS Viveka: కేసులో సెన్సేషనల్ ట్విస్ట్..! షర్మిల సాక్షం కీలకం కాబోతుందా..!?

YS Viveka: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ సెన్సేషనల్ గా మారిన కేసు ఏదైనా ఉంది అంటే అది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసే. రాష్ట్రంలో ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా దీనిపైనే చర్చించుకుంటున్నారు. ఈ హత్య కేసులో వైసీపీ ఆరోపణలు ఒక విధంగా ఉన్నాయి. ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి పాత్ర ఉంది అనేది వైసీపీ ఆరోపణ. అలానే వైఎస్ సునీతా రెడ్డి, ఆమె భర్త రాజశేఖరరెడ్డి హస్తం కూడా ఉంది అనేది వైసీపీ ఆరోపణ. ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి రెండు మూడు రోజుల నుండి మీడియా సమావేశాలు పెట్టి ఇవే విషయాలను చెబుతున్నారు. మరో వైపు తెలుగుదేశం పార్టీ వైసీపీపై విమర్శలు చేస్తోంది. వైసీపీ ఎంపి అవినాష్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. అవినాష్ రెడ్డి పాత్ర ఉంది, ఆయన తండ్రి భాస్కరరెడ్డి పాత్ర కూడా ఉంది దాన్ని కప్పిపుచ్చడానికి వైసీపీ ఈ డ్రామాలకు తెర తీస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. ఇలా రెండు రాజకీయ పార్టీలు రెండు రకాలుగా వాదనలు తెరపైకి తీసుకువస్తున్నాయి.

YS Viveka murder case new twist
YS Viveka murder case new twist

Read More: YS Viveka: ఒక పెద్ద అరెస్టు..!? ఢిల్లీ నుండి కడపకు కీలక అధికారి..!

YS Viveka: షర్మిలను సీబీఐ ప్రశ్నిస్తుందా..?

అయితే ఈ కేసులో కొన్ని టర్నింగ్ పాయింట్ లు ఉన్నాయి. సీబీఐ చేసిన దర్యాప్తు ప్రకారం చూసుకుంటే రోజుకు ఒక కొత్త పేరు తెరమీదకు వస్తోంది. ప్రతి రోజు ఒక కొత్త ట్విస్ట్ తెరమీదకు వస్తోంది. తాజాగా వచ్చిన విషయం ఏమిటంటే.. వైఎస్ షర్మిల సాక్షం ఈ కేసులో కీలకం కాబోతున్నది, వైఎస్ షర్మిలతో వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోవడానికి ముందు మాట్లాడిన మాటలు ఈ కేసులో అత్యంత కీలకం కాబోతున్నాయి అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. వైెఎస్ వివేకానంద రెడ్డి గతంలో షర్మిలతో “కడప ఎంపిగా ఉంటే నీవు ఉండాలి లేకపోతే నేను ఉండాలి. కడప వైసీపీ నుండి నువ్వు అయినా పోటీ చేయాలి లేకపోతే నేనైనా పోటీ చేయాలి వేరే వాళ్లు వద్దు” అని అన్నారుట. ఆమెతో వివేకా అలా అన్నారు అని వేరే వాళ్లు చెప్పారు కానీ షర్మిల ఈ విషయాన్ని నేరుగా మీడియా సమావేశంలో చెప్పలేదు. షర్మిల ఈ మాటలను అధికారికంగా దృవీకరించలేదు. తాజాగా ఇప్పుడు ఆమె పేరు తెరమీదకు రావడంతో ఆమె ఏమి చెప్పబోతున్నారు, సీబీఐ ఆమెను ప్రశ్నిస్తుందా..? లేదా అనేది కీలకమైన అంశంగా మారింది.

 

Read More: Mohan Babu: మంచు ఫ్యామిలీ 5 తప్పులు ఇవే..! మోహన్ బాబు ట్రోలింగ్స్ సీక్రెట్లు

ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలను విచారణకు ఎందుకు విచారించలేదు

వివేకా హత్య కేసుకు సంబంధించి తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి సీబీఐకి ప్రశ్నలు సంధించారు. ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలను విచారణకు ఎందుకు విచారించలేదు అని ప్రశ్నించారు. గుండె పోటు అని చెప్పింది ఆదినారాయణరెడ్డే కదా, శివప్రసాదరెడ్డి ఆదినారాయణరెడ్డికి ఫోన్ చేసి చెప్పారుకదా అని సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. నిజానికి ఆ ఘటన జరిగిన రోజు మొట్టమొదట మీడియా ముందుకు వచ్చి వివేక గుండెపోటుతో మృతి చెందారు అని చెప్పింది విజయసాయిరెడ్డి. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీడియా ముందు విజయసాయి చెప్పిన మూడు గంటల తరువాత వివేకా శరీరంగా గొడ్డలి గాయాలు ఉన్నాయనీ, ఇది హత్య అని వెల్లడించారు. ఈ కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చాల్సింది సీబీఐయే. ఈ కేసులో ఏ 1 నుండి ఏ 5వరకూ సీబీఐ పేర్లు పెట్టేశారు. రోజుకు ఒక ట్విస్ట్ వెలుగు చూస్తున్న నేపథ్యంలో సీబీఐ ఎలా ముందుకు వెళ్లి ఈ కేసును ఛేదిస్తుందో వేచి చూడాలి.

author avatar
Srinivas Manem

Related posts

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!

PM Modi: రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోడీ కౌంటర్ ఇలా .. ‘శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ నాలుగో తేదీ తెలుస్తుంది’  

sharma somaraju