25.2 C
Hyderabad
January 31, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైఎస్ వివేకా హత్య కేసు విచారణపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు .. కేసు విచారణ హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ

Share

ఏపిలో తీవ్ర సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు మంగళవారం కీలక ఆదేశాాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సుందరేశన్ లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. హత్య కేసులో సాక్షధారాలు నాశనం చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయని తెలిపింది. దర్యాప్తుపై మృతుడి భార్య, కుమార్తె వివేకా అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ఇక్కడి (సుప్రీం కోర్టు) వరకూ రావడం బాధాకరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది, వివేకా హత్య కేసులో ఏపిలో సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదనీ, దర్యాప్తులో తాత్సారం జరుగుతోందని, దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే కేసులు కూడా నమోదు చేశారని కావున ఏపి నుండి ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ సందర్భంలో వివేకా కుమార్తె వాదనలకు సమర్ధిస్తూ సీబీఐ కూడా అఫిడవిట్ దాఖలు చేసింది.

YS Viveka Murder Case

 

ఈ పిటిషన్ ను విచారణ జరిపిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ల ప్రాదమిక హక్కులను పరిగణలోకి తీసుకుని కేసు విచారణను బదిలీ చేస్తున్నట్లుగా న్యాయమూర్తులు పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో ఎవరిని ప్రశ్నించాలన్నా అడ్డంకులు తప్పడం లేదని, విచారణకు స్థానిక యంత్రాంగం సహకరించడం లేదని అఫిడవిట్ లో పేర్కొంది. ఈ కేసులో దురాలోచనతో కూడిన కుట్ర కోణం దాగి ఉందనీ, అదే సమయంలో కేసును తారుమారు చేయడంతో పాటు అన్ని రకాల సాక్షాలను ధ్వంసం చేశారనీ, ఈ పరిణామాలన్నింటిలో ఉన్న కుట్ర కోణం బయటకు రావాలంటే తదుపరి విచారణ కొనసాగించాలనీ, కడపలో స్థానికంగా ఉన్న పరిస్థితుల్లో విచారణ జరగడం కంటే బయట రాష్ట్రంలో కొనసాగడమే సముచితంగా భావిస్తున్నామనీ, అందుకే కేసును హైదరాబాద్ కు బదిలీ చేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.

YS Viveka Case: New Suspects in CBI Enquiry


Share

Related posts

సొంత అజెండాతో జనసేనాని ముందుకు ? మౌన ముద్ర అందుకు!!

Yandamuri

ప్రభుత్వ వైద్య కళాశాలలో 542 ఖాళీలు..

bharani jella

నల్లని  బియ్యం  గురించి ఆశ్చర్య పరిచే  వివరాలు  తెలుసుకోండి !!

Kumar