NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Viveka Murder Case: వైఎస్ వివేకా కుమార్తె సునీత సంచలన ఆరోపణలు..కుటుంబ భద్రతకై మరో సారి వినతి..

YS Viveka Murder Case: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కీలక దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో నిందితుడుగా భావిస్తున్న అనిల్ కుమార్ యాదవ్ ను అరెస్టు చేసి అతని వద్ద నుండి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు ప్రచారం జరుగుతోంది. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సీబీఐ అధికారులు సేకరించిన కీలక సమాచారంతో కడప ఎంపి అవినాష్ రెడ్డి పీఏలను, పులివెందుల సాక్షి మీడియా ప్రతినిధిని విచారించారు. ఈ పరిణామాల క్రమంలోనే వివేకా కుమార్తె డాక్టర్ సునీత తన కుటుంబానికి ప్రాణ హాని ఉందంటూ మరో సారి ఆరోపణలు చేయడం సంచలనం అయ్యింది. ఇంతకు ముందు సీఐకి ఫిర్యాదు చేసిన సునీత తాజాగా జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. తన ఇంటి ముందు అనుమానితులు రెక్కీ నిర్వహించారని తక్షణం తన కుటుంబానికి భద్రత కల్పించాలని కోరారు. సునీత గతంలోనూ భద్రత కోసం లేఖ రాయడం జరిగింది.

YS Viveka Murder Case: YS Sunita letter to Kadapa sp
YS Viveka Murder Case YS Sunita letter to Kadapa sp

సునీత ఎస్పీకి రాసిన లేఖలో మణికంఠ రెడ్డి అనే వ్యక్తి రెక్కీ నిర్వహించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. మణికంఠ రెడ్డి వైసీపీ నాయకుడు దేవిరెడ్డి శివశంకరరెడ్డి అనుచరుడని పేర్కొన్నారు. తన తండ్రి హత్య కేసులో శివశంకరరెడ్డి ప్రధాన అనుమానితుడుగా ఉన్నారనీ, ఇప్పుడు అతని అనుచరుడు రెక్కీ నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆమె లేఖలో వివరించారు. సీసీ కెమెరా విజువల్స్ ద్వారా అనుమానితుడిని గుర్తించామని, వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు తమ కుటుంబానికి భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీ తో పాటు డీజీపీ, సీబీఐ అధికారులకు సునీత లేఖలు పంపారు

మరో పక్క వివేకా హత్య కేసుల 68వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. పులివెందుల ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నందు అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఎంపి అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకరరెడ్డిని శుక్రవారం సీబీఐ అధికారులు విచారించారు. వివేకా కేసులో శంకర్ రెడ్డి కీలక అనుమానితుడుగా ఉన్నారు. ఆయనతో పాటు పులివెందుల క్యాంపు కార్యాలయంలో పని చేసే రఘునాధరెడ్డి కూడా నేటి విచారణకు హజరైయ్యారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!