NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Viveka Murder Case: వివేకా కేసులో కీలక పరిణామం .. సీబీఐ ముందు సంచలన విషయాలు వెల్లడించిన వివేకా రెండో భార్య షమీమ్

ys viveka second wife shamim sensational statement on ys viveka murder case

YS Viveka Murder Case: ఏపిలో ప్రకంపనలు రేపుతోన్న వైఎస్ వివేకా హత్య కేసు రోజుకో మలుపుతిరుగుతోంది. కేసు విచారణ కీలక దశకు చేరుకుంది అనుకుంటున్న తరుణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్యకు మూడు నాలుగు కారణాలు ఉన్నాయంటూ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డి వెల్లడించారు. సీబీఐ అధికారులు ఆ దిశగా విచారణ చేయకుండా వ్యక్తుల టార్గెట్ గా దర్యాప్తు జరుపుతున్నారంటూ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో వివేకా రెండో భార్య షమీమ్ నుండి సైతం సీబీఐ అధికారులు వ్యాంగ్మూలం తీసుకున్నారు. ఇప్పుడు షమీమ్ సీబీఐకి ఇచ్చిన స్టేట్ మెంట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. షమీమ్ సీబీఐకి ఇచ్చిన మూడు పేజీల స్టేట్ మెంట్ లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్ రెడ్డి పేర్ల ప్రస్తావన లేకపోవడం గమనార్హం. వివేకా హత్యకు ముందు జరిగిన పరిణామాలను షమీమ్ వివరించారు.

ys viveka second wife shamim sensational statement on ys viveka murder case
ys viveka second wife shamim sensational statement on ys viveka murder case

 

షమీమ్ తన స్టెట్ మెంట్ లో 2010 అక్టోబర్ 3న వివేకాతో తనకు వివాహం జరిగిందని చెప్పారు. 2015 లో తమకు షేహాన్ షా (కొడుకు) జన్మించినట్లు తెలిపారు. వివేకాకు దూరంగా ఉండాలని సునీతా రడ్డి బెదిరించేదని చెప్పారు. హత్యకు కొన్ని గంటల ముందు వివేకా తనతో మాట్లాడారని అన్నారు. బెంగళూరు భూ సెటిల్ మెంట్ లో రూ,.8 కోట్లు వస్తాయని వివేకా చెప్పారన్నారు. తమ వివాహం వివేకా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని, తమను దూరం పెట్టారన్నారు.  షేహన్ షాను రాజకీయంగా పైకి తీసుకొస్తానని వివేకా చెప్పేవారన్నారు. పలు మార్లు శివ ప్రకాష్ రెడ్డి బెదరించారన్నారు. ఆ కారణంగా చనిపోయాడని తెలిసినా రాలేకపోయానని పేర్కొన్నారు. అన్యాయంగా వివేకా చెక్ పవర్ తొలగించారని తెలిపారు షమీమ్. తమ కుమారుడు షెహన్ షా పేరుతో నాలుగు ఎకరాల పొలం కొందామని వివేకా అనుకున్నారనీ, కానీ దాన్ని శివ ప్రకాశ్ రెడ్డి ఆపేశారని పేర్కొన్నారు.

సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ నెలాఖరులోగా సీబీఐ కేసు విచారణ పూర్తి చేయాల్సిన తరుణంలో కొత్త కొత్త విషయాలు తెరపైకి రావడం ఆసక్తికరంగా మరింది. ఈ కేసు దర్యాప్తు సీబీఐకి ఒక సవాల్ గా మారిందని చెప్పుకోవచ్చు. మరో పక్క ఈ కేసులో అరెస్టు అయిన భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలతో పాటు వైఎస్ అవినాష్ రెడ్డిలను మూడు రోజులుగా సీబీఐ విచారించారు. ఈ నెల 24వ తేదీ వరకూ భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ విచారించనున్నది.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N