YS Vivekananda Reddy: అవినాష్ రెడ్డికి వైఎస్ వివేకాకు అక్కడే మొదలైంది..! వైఎస్ వివేకా హత్యకు అసలు కారణం..?

Share

YS Vivekananda Reddy: దివంగత సీఎం వైఎస్ఆర్ కుటుంబంలో కీలక వ్యక్తి, ఆయన సోదరుడు వైసీపీ నేత వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ వ్యాప్తంగా ఓ సంచలనం అయ్యింది. 2019 ఎన్నికలకు నెల రోజుల ముందు జరిగిన ఈ హత్యను రాజకీయంగా తనకు అనుకూలంగా ఎంతగా వాడుకోవాలో అంతగా వాడుకుంది వైసీపీ. వివేకాను చంద్రబాబే చంపించాడనీ, టీడీపీయే హత్య చేయించిందనీ, సీబీఐ దర్యాప్తు జరపాలంటూ నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న నేటి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి డిమాండ్ చేశారు. ఆయనతో పాటు అవినాష్ రెడ్డి, వైఎస్ కుటుంబీకులు, వైెసీపీ నేతలు డిమాండ్ చేశారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ హత్య కేసు దర్యప్తును పక్కదారి పట్టిస్తూ..నెమ్మది చేస్తూ వచ్చారు. అయితే వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది.

YS Vivekananda Reddy: వైసీపీకి బలం ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి

సీబీఐ ఈ కేసులో మూలాల్లోకి వెళ్లి పరిశోధన చేయగా ఎవరు చేయించారు ? ఎందుకు చేయించారు ? అనేది బయటకు వచ్చేసింది. వైెెఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి చెబితే ఎర్ర గంగిరెడ్డి ఈ హత్య చేయించాడని అప్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరి వ్యూంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ హత్యలో ఎర్ర గంగిరెడ్డికి తనతో పాటు సునీల్ కుమార్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి సహకరించడం జరిగిందని తెలిపాడు. అయితే దస్తగిరి చెప్పినట్లు అవినాష్ రెడ్డికి వివేకాను హత్య చేయించాల్సిన అవసరం ఉందా ?, వివేకానందరెడ్డికి, అవినాష్ రెడ్డికి గొడవ ఎందుకు వచ్చింది ? ఆయనపై అభియోగాన్ని కోర్టులో నిరూపించడం సాధ్యం అవుతుందా ? అనే విషయాలను పరిశీలిస్తే.. ఎర్ర గంగిరెడ్డి వివేకానంద రెడ్డికి ప్రధాన అనుచరుడు. అవినాష్ రెడ్డి ఆయనకు బంధువు. 2017లో టీడీపీ అధికారంలో ఉండగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. నాడు కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల్లో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల్లో వైసీపీ ఆధిక్యంలో ఉంది. అయితే నాడు కడపలో వైసీపీ తరుపున ఎమ్మెల్సీగా పోటీ చేసిన వివేకానంద రెడ్డి 30 ఓట్ల తేడాతో ఓడిపోయారు. నాడు టీడీపీ అభ్యర్ధి బీటెక్ రవి ఎమ్మెల్సీగా గెలిచారు. వాస్తవానికి సంఖ్యాపరంగా చూసుకుంటే వైసీపీ మద్దతుదారులే ఎంపీటీసీలు ఎక్కువ మంది ఉన్నారు. ఆ ఎన్నికల్లో వివేకా గెలవాల్సి ఉండగా ఓడిపోయారు. అంటే వైసీపీ నుండి కొంత క్రాస్ ఓటింగ్ జరిగిందనీ, సుమారు 30, 40 మంది వైసీపీ వాళ్లు టీడీపీకి సహకరించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో వివేకా తనకు నమ్మక ద్రోహం జరిగినట్లు గుర్తించారు. అవినాష్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి తన గెలుపునకు సహకరించలేదనీ, ముఖ్యంగా తన అనుచరుడైన గంగిరెడ్డి ప్రత్యర్ధులకు సహకరించాడని భావించారు. ఆ నేపథ్యంలోనే వాళ్లతో వాగ్వివాదానికి దిగారు. అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగారు వివేకా.

YS Vivekananda Reddy: ఇక ఎర్ర గంగిరెడ్డి చేప్పేది కీలకం

2019 ఎన్నికల్లో అవినాష్ రెడ్డి ఎంపిగా పోటీ చేసినప్పుడు వివేకానంద రెడ్డి సహకరించకపోతే, రివర్స్ అయి రెబల్ గా పోటీ చేసినా అవినాష్ రెడ్డికి ఇబ్బంది తప్పదు. మరో వైపు గంగిరెడ్డికి వివేకానంద రెడ్డికి మధ్య బెంగళూరులోని ఓ స్థలం విషయంలో వివాదం ఉందని దస్తగిరి చెప్పారు. అయితే వివేకా హత్యకు అటు ఆర్ధికపరమైన వివాదం, రాజకీయ పరమైన వివాదం కారణంగా ఉండగా గంగిరెడ్డి మొత్తం తనపై వేసుకుని ఈ తతంగం నడిపాడు అనేది దస్తగిరి చెబుతున్న దాని బట్టి వెల్లడి అవుతోంది. అయితే ఈ కేసులో అవినాష్ రెడ్డిని నిందితుడిగా చూపాలా ? వద్దా అనే దానిపై సీబీఐ న్యాయపరమైన సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఎందుకంటే .. వివేకానందరెడ్డిని హత్య చేస్తే రూ.40కోట్లు ఇస్తానని అవినాష్ రెడ్డి చెప్పాడని గంగిరెడ్డి తనకు చెప్పాడని దస్తగిరి కన్ఫెషన్ స్టేట్ మెంట్ లో పేర్కొన్నాడు. అంటే దస్తగిరితో నేరుగా అవినాష్ రెడ్డి మాట్లాడినట్లు లేదు. తన వెనుక అవినాష్ రెడ్డి, బాస్కరరెడ్డి ఉన్నట్లుగా గంగిరెడ్డి చెప్పాడని దస్తగిరి పేర్కొంటున్నాడు. దీంతో సీబీఐ అధికారులు దస్తగిరి ఇచ్చిన వ్యాంగ్మూలం ఆధారంగా గంగిరెడ్డిని విచారించే అవకాశం ఉంటుంది. దస్తగిరి పేర్కొన్నట్లు హత్య వెనుక అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డిల పాత్ర ఏమైనా ఉందా రూ.40 కోట్ల సుపారీకి సంబంధించి లావా దేవీలు ఎలా జరిగాయి ? అనేది లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే సీబీఐ విచారణలో గంగిరెడ్డి కూడా అప్రూవర్ గా మారితే కేసు తేలిపోయింది. అలా కాకుండా తానే వివేకాతో ఉన్న విబేధాల కారణంగా హత్య చేయించాననీ, అవినాష్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటే పెద్దల పాత్ర బయటపడదు. ఒక వేళ వాళ్ల పేర్లు చెప్పినా అందుకు తగ్గట్లు సాక్షాలను కూడా చూపాల్సి ఉంటుంది. ఇంకా సీబీఐకి చాలా సవాళ్లు, పరీక్షలు ఉన్నాయి.


Share

Related posts

న్యూఢిల్లీ : రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో బీజేపీ విజయం తథ్యం : గడ్కరీ

Siva Prasad

SEC : మున్సిపల్ ఎన్నికలపై నిమ్మగడ్డ తాజా ఆదేశాలు ..

somaraju sharma

Home Appliances : ఇవి కొనాలనుకుంటున్నారా అయితే త్వరపడండి..!! లేదంటే..

bharani jella