YSR Pelli Kanuka: వైఎస్ఆర్ పెళ్లి కానుకకు జగనన్న మంగళం పాడినట్లేనా..?

Share

YSR Pelli Kanuka: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి నవరత్న పథకాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో తొలి ఏడాదిలోనే 90 శాతం నెరవేర్చారు. సంక్షేమ పథకాల అమలునకు సంబంధించి క్యాలెండర్ ను కూడా విడుదల చేశారు. కానీ ప్రధానంగా ఓ ముఖ్యమైన పథకానికి పేరు మాత్రం మార్చారు కానీ పథకం అమలును ప్రభుత్వం మరచిపోయింది.

YSR Pelli Kanuka ignored ap cm ys jagan
YSR Pelli Kanuka ignored ap cm ys jagan

అది ఏమిటంటే….రాష్ట్రంలో దారిద్ర రేఖకు దిగువను ఉన్న వివిధ పేద వర్గాలకు చెందిన వారు వివాహాలు చేసుకుంటే ప్రభుత్వం గతం నుండి వధూవరులకు ఆర్థిక సహాయం ఇస్తుండేది. గతంలో చంద్రన్న పెళ్లి కానుకగా అమలు చేసిన పథకాన్ని వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ఆర్ పెళ్లి కానుకగా మార్పుచేశారు. దీనికి సంబంధించిన వెబ్ సైట్ లో పేరు మార్పు చేశారు గానీ వివాహాలు చేసుకున్న నూతన వధువరులకు ప్రభుత్వం నుండి నిధులు మాత్రం విడుదల కావడం లేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందు పెళ్లి చేసుకున్న వారికి గానీ ఆ తరువాత ఈ రెండేళ్లలో వివాహాలు చేసుకున్న వారికి గానీ ప్రభుత్వం నుండి ఒక్క రూపాయ కూడా విడుదల కాలేదు. దీంతో వేలాది మంది నిరుపేదలు ప్రభుత్వం మంజూరు చేసే ఈ నగదు కోసం నెలలు తరబడి ఎదురు చూపులు చూస్తున్నారు.

YSR Pelli Kanuka ignored ap cm ys jagan
YSR Pelli Kanuka ignored ap cm ys jagan

కేటగిరిల వారీగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు చెందిన వారికి లక్ష రూపాయలు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు చెందిన కులాంతర వివాహాలు చేసుకుంటే లక్షా 25వేలు, బీసీ వర్గాలకు చెందిన రూ.50వేలు, కులాంతర బీసీ వివాహాలకు రూ.75లు, మైనార్టీలకు లక్ష రూపాయలు, అంగవైకల్యం చెందిన వారికి లక్షా 50వేలు, కూలీల పిల్లలకు లక్ష రూపాయల వరకూ ఆర్థిక సహాయాన్ని పెంపుదల చేస్తూ వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం నిర్ణయంచింది. గతంలో ఉన్న ఆర్థిక సహాయాన్ని కొంత మేర అయితే పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు గానీ రెండేళ్లుగా నిధులు మాత్రం విడుదల చేయలేదు. వివాహాలు చేసుకున్న వారు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వం మంజూరు చేసే ఈ ఆర్థిక సహాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వం నుండి నిధులు విడుదల కాలేదనీ, నిధులు విడుదల అయితే నేరుగా మీ బ్యాంకు అకౌంట్ ను ఆర్థిక సహాయం జమ అవుతుందని సంబంధిత అధికారులు వారికి తెలియజేస్తున్నారు.

అయితే ప్రభుత్వం తాజాగా సంక్షేమ పథకాల క్యాలెండర్ లో జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన, రైతులకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ రబీ, డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ ఉచిత పంటల భీమా, రైతు భరోసా, మత్స్యకార భరోసా, జగనన్న విద్యాకానుక, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ఇలా పథకాలతో ఏప్రిల్ నుండి ఫ్రిబవరి వరకూ ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో వైఎస్ఆర్ పెళ్లి కానుకను చేర్చకపోవడంతో జగనన్న ఈ పథకానికి మంగళం పాడారా అన్న అనుమానం ప్రజల్లో కలుగుతోంది. దీనిపై ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Share

Related posts

Janagama: దయ్యం దయ్యం దయ్యం – మొత్తం ఆ కాలనీ అంతా ఖాళీ చేసేశారు.

Naina

ప‌వ‌న్ కొత్త స్కెచ్‌….వ‌ర్క‌వుట్ అవుతుందా?

sridhar

రేణు దేశాయ్ తన పిల్లల విషయంలో పవన్ నుంచి ఇదే కోరుకుంటున్నారా?

Naina