YSR Vahana Mitra: ఆటో, ట్యాక్సీ వాలాలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..వాహన మిత్ర లబ్దికి ధరఖాస్తుల స్వీకరణ

Share

YSR Vahana Mitra: జగన్మోహనరెడ్డి (YS Jaganmohan Reddy) సర్కార్ వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం 2022 – 23 లబ్దిదారులుక గుడ్ న్యూస్ చెప్పింది. వాహన మిత్ర లబ్దిదారులకు ఈ నెల 13వ తేదీ ఆర్ధిక సహాయం అందించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అర్హుల నుండి ధరఖాస్తుల స్వీకరణకు రవాణా శాఖ (Transport Department)  చర్యలు చేపట్టింది. వాహన మిత్ర పథకం (YSR Vahana Mitra) అర్హులైన వారు ఈ నెల 7వ తేదీలోగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ధరఖాస్తులు చేసుకోవాలని రవాణా శాఖ కమిషనర్ పి రాజాబాబు తెలిపారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ఆరంచెల విధానంలో పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. ధరఖాస్తుదారు తనకు సంబంధించిన భూమి, ఆస్థి వివరాలు, ఆస్థి పన్ను కట్టిన వివరాలు, విద్యుత్ వినియోగం, ఆదాయపన్ను, కులం వివరాలు తెలపాల్సి ఉంటుందని తెలిపారు.

YSR Vahana Mitra Scheme Distribution on July 13th

 

ఇప్పటికే వైఎస్ఆర్ వాహన మిత్ర ఆర్ధిక సాయం పొందుతున్న వారు వాహనంతో నిలబడిన ఫోటోను గ్రామ సచివాలయం ద్వారా అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఒక కుటుంబానికి ఒక వాహనానికి మాత్రమే ఆర్ధిక సహాయం అందిస్తామనీ, వాహనదారులు ఆధార్ కార్డుతో పాటు తెల్ల రేషన్ కార్డు కల్గి ఉండాలన్నారు. ధరఖాస్తు దారు విద్యుత్ వినియోగం ఆరు నెలల సగటు మీద నెలసరి 300 యూనిట్లు దాటితే పథకానికి అనర్హులు అవుతారని తెలిపారు. వాహన యజమాని హక్కులు మార్పు చేసినా, తప్పుడు పత్రాలు సమర్పించినా వారిని అనర్హులుగా పరిగణిస్తామని పి రాజబాబు తెలిపారు. అర్హులైన వారికి ఈ నెల 13వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చేతుల మీదుగా సాయం అందించడం జరుగుతుందని వెల్లడించారు.

 


Share

Recent Posts

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

1 గంట ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

5 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

6 గంటలు ago

విజయ్ దేవరకొండ “లైగర్” కి సెన్సార్ షాక్..!!

"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…

8 గంటలు ago