NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ysrcp : ఎన్నికల వేళ ఆ అధికార పార్టీ మహిళా ఎమ్మెల్యేకు భారీ షాక్..! 60 కుటుంబాలు టీడీపీలో చేరిక..!!

ysrcp : సాధారణంగా ఎన్నికల సమయంలో ఈ పార్టీ నుండి ఆ పార్టీకి, ఆ పార్టీ నుండి ఈ పార్టీకి కార్యకర్తలు, నేతలు చేరడం సహజమే. అయితే ప్రతిపక్ష పార్టీ నుండి అధికార పక్షానికే ఎక్కువ మంది మొగ్గుచూపుతుంటారు. అయితే ఆ నియోజకవర్గంలో సీన్ రివర్స్ లో అయ్యింది. అధికార పార్టీ నుండి దాదాపు 60 కుటుంబాలు టీడీపీకి చేరిపోయి మహిళా ఎమ్మెల్యేకి భారీ షాక్ ఇచ్చారు.

ysrcp : 60 families from Rayadurgam join TDP
ysrcp 60 families from Rayadurgam join TDP

స్థానిక ఎన్నికలు ఇప్పుడు వస్తాయని ప్రభుత్వం, అధికార వైసీపీ అసలు ఊహించలేదు. దీంతో ఆ పార్టీ నేతలు సిద్దం గా లేరు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వానికి ఒక మాట చెప్పాలి కాబట్టి చెప్పేసి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఊహించని ఈ పరిణామంతో ఖంగు తిన్న ప్రభుత్వం వెంటనే హైకోర్టుకు వెళ్లి కరోనా వ్యాక్సినేషన్ జరుగుతోందంటూ చెప్పి ఎన్నికల షెడ్యుల్ ను రద్దు చేయించింది. అయితే హైకోర్టు సింగిల్ జడ్డి ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పును ఎస్ఈసీ డివిజన్ బెంచ్ కి అప్పీల్ చేయడంతో ఎన్నికలు నిర్వహించుకోవచ్చంటూ హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం చివరి ప్రయత్నంగా సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఎస్ఈసీ నిర్ణయమే ఫైనల్ అయ్యింది.

దీంతో రాష్ట్రంలో స్థానిక సంగ్రామం మొదలైంది. తొలి దశ ఎన్నికల నామినేషన్ ల స్వీకరణలు పూర్తి అయ్యయి. పలు జిల్లాలలో అధికార పార్టీ నేతలు వివిధ రకాల ప్రలోభాలతో ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకుని కండువాలు కప్పేస్తున్నారు. అయితే అనంతపురం జిల్లా కల్యాణ దుర్గం నియోజకవర్గంలో అధికార వైసీపీ నుండి దాదాపు 60 కుటుంబాల వారు ఎన్నికల తరుణంలో టీడీపీలో చేరడం విశేషం. తిమ్మసముద్రం గ్రామానికి చెందిన వైసీపీ సానుభూతిపరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో వీరు టీడీపీలో చేరారు. ఈ నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉషాశ్రీ చరణ్ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఎన్నికల ముందు ఆమె వైసీపీలో చేరినప్పటికీ కార్యకర్తలు, నేతలు ఆమె గెలుపునకు కృషి చేశారు. అయితే గెలిచిన తరువాత ఆమె నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకుండా బెంగళూరులో ఉంటున్నారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు.

దీనికి తోడు అనంతపురం ఎంపీ రంగయ్యకు ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ కు మధ్య కూడా సన్నిహత సంబంధాలు లేవని అంటున్నారు. ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ ప్రజలకు, పార్టీ శ్రేణులకు అందుబాటులో లేకుండా ఉండగా టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జి ఉమామహేశ్వర్ నాయుడు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి గతంతో పోల్చుకుంటే చాలా వరకు మెరుగుపడింది అని అంటున్నారు. స్థానిక ఎన్నికల వేళ దాదాపు 60 కుటుంబాల వారు అధికార వైసీపీని వీడి టీడీపీలో చేరడం ఆ పార్టీకి బూస్ట్ ఇచ్చినట్లు అయ్యింది. ఎమ్మెల్యే పనితీరుతో విసిగిపోయి తాము పార్టీ మారుతున్నట్లు ఈ సందర్భంగా వారు చెప్పడం గమనార్హం.

author avatar
sharma somaraju Content Editor

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N