NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YSRCP: జిల్లాల వారీగా బీసీ చైతన్య సదస్సుల నిర్వహణకు వైసీపీ యాక్షన్ ప్లాన్

YSRCP: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో బీసీ వర్గాల అభ్యున్నతి, మేళ్లను వివరించేందుకు జిల్లాల వారీగా చైతన్య సదస్సులు నిర్వహించేందుకు వైసీపీ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గురువారం బీసీ మంత్రుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు, శంకరనారాయణ పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో జిల్లాల వారీగా బీసీ చైతన్య సదస్సులు నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు.

YSRCP BC Ministers meeting Sajjala Ramakrishna Reddy
YSRCP BC Ministers meeting Sajjala Ramakrishna Reddy

 

Read More: YSRCP: సీఎం సొంత జిల్లాలో..వైసీపీ నేతల బాహాబాహీ..!!

YSRCP: కొత్త జిల్లాల్లో ప్రాంతీయ సదస్సులు

సమావేశం అనంతరం బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. బీసీలకు సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు, జరిగిన మేళ్లను చర్చించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 139 బీసీ ఉప కులాలు ఉండగా 56 కార్పోరేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. బీసీల ఆత్మగౌరవం కోసం తీసుకున్న చర్యలను వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు చేపట్టాలని నిర్ణయించామనీ, ముందుగా కొత్త జిల్లాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించి ఆ తరువాత రాష్ట్ర స్థాయిలో బిసీ సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రూ.31వేల కోట్లు బీసి సబ్ ప్లాన్ కోసం కేటాయించడం జరిగిందన్నారు. బీసీ సంఘం రాష్ట్ర నేత జంగా కృష్ణమూర్తి సహా తాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బీసీ నేతలు, ప్రజలను సమాయత్తం చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ఏప్రిల్ 15 తేదీ తరువాత పర్యటనలు చేస్తామని తెలిపారు.

 

విద్యుత్ చార్జీలపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదు

ఇదే సందర్భంలో విద్యుత్ చార్జీల పెంపుపై ప్రతిపక్షాల ఆందోళనపైనా ఆయన స్పందించారు. టీడీప ప్రభుత్వ హయాంలో విద్యుత్ చార్జీలు పెంచలేదా అని ప్రశ్నించారు చెల్లుబోయిన. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకాలను చంద్రబాబు తీసేసిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై టీడీపీ ప్రభుత్వం భారం వేసిందన్నారు. విద్యుత్ చార్జీలపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదన్నారు. ప్రజలను ఏదో విధంగా దృష్టి మరల్చడమే టీడీపీ లక్ష్యమని అన్నారు. ఏ ప్రభుత్వం మంచి చేస్తుందో,ఆదుకుంటుందో అనే విషయం ప్రజలందరికీ తెలుసునని ఆయన అన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju