NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

YSRCP: వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలన ప్రారంభించినప్పటి నుండి అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతిపక్షాల నుండి విమర్శలు, కొర్టుల నుండి అక్షింతలు ఎదురైనా తను అనుకున్న పనులు చేసి తీరుతున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఘోరంగా ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగిస్తున్నారు. హామీల్లో 80 శాతం పైగా అమలు చేశారు. ప్రభుత్వ పరంగా ఇలా ఉంటే పార్టీ పరంగా కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో జగన్ తరువాతే ఎవరైనా అనాల్సిందే. తెలుగుదేశం పార్టీలో అసమ్మతిగా ఉండి పార్టీ వ్యతిరేకంగా మాట్లాడిన నాయకుడిపై చర్యలు తీసుకోవాలంటే అచిచూసి అడుగులు వేస్తుంటారు. ఒక వేళ పార్టీ లైన్ మీరి ఏదైనా కామెంట్స్ చేస్తే ముందుగా షోకాజ్ నోటీసు జారీ చేసి ఆ తరువాత వివరణ తీసుకుని చర్యలు తీసుకుంటారు. నాయకుల మధ్య బేధాభిప్రాయాలు, విభేదాల కారణంగా ఏదైనా వ్యాఖ్యలు చేసినా పార్టీ అంతగా పట్టించుకోదు.

YSRCP Chief, CM YS Jagan Serious Action
YSRCP Chief CM YS Jagan Serious Action

 

YSRCP: టీడీపీలో దిక్కార స్వరం వినిపించినా..

పార్టీపై దిక్కార స్వరం వినిపించిన కొందరు నాయకులపైనా చంద్రబాబు గతంలో చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు. రీసెంట్ గా పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఓ యూట్యూబ్ ఛానల్ లో సంచలన కామెంట్స్ చేసినా ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేయలేదు. చర్యలు చేపట్టలేదు. పార్టీలోని అంతర్గత రాజకీయాలపై విమర్శలు చేసి ఆమె పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలో పరిస్థితి ఈ విధంగా ఉంటే వైసీపీలో మాత్రం ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ యాక్షన్ తీవ్రంగా ఉంటుంది నిరూపిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో కొందరు ఆశావహ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేసినా మరల వెంటనే తమ సమ్మతిని తెలియజేసేలా చర్యలు తీసుకున్నారు. ఆ నాయకులు తరువాత జగన్ ను కలిసి తమకు ఎటువంటి అసంతృప్తి లేదని ప్రకటించిన విషయం చూశాం. హత్య కేసులో అరెస్టు అయిన ఎమ్మెల్యే అనంత ఉదయ్ భాస్కర్ (అనంతబాబు)ను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఈ విషయంలో వెంటనే స్పందించి ప్రతిపక్షాల నుండి విమర్శలు రాకుండా చర్యలు తీసుకున్నారు.

 

సీనియర్ నాయకుడైనా దిక్కరిస్తే వేటే

మరో పక్క రీసెంట్ గా నరసాపురంకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుని అకస్మాత్తుగా పార్టీ నుండి సస్పెండ్ చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా పోటీ చేస్తాననీ, తనకు వ్యక్తిగతంగా బలం ఉందని వ్యాఖ్యలు చేసిన 24 గంటల వ్యవధిలో ఆయనపై  వేటు వేశారు జగన్. సుమారు 40 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్న నాయకుడికి సైతం ఎటువంటి షోకాజ్ నోటీసు జారీ చేయకుండా పార్టీ నుండి సస్పెండ్ చేయడం గమనార్హం. అంతకు ముందు కూడా ఎస్వీబీసీ చైర్మన్ పృద్విరాజ్ పై ఆరోపణలు రావడంతో వెంటనే ఆయనపై చర్యలు తీసుకుంది. ఇవన్నీ పరిశీలిస్తే దటీజ్ జగన్ అనాల్సిందేగా.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!