NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: చంద్రబాబు సొంత జిల్లాలో వైసీపీలో రగిలిన రగడ..! సీఎం కి తలనొప్పి వ్యవహారం..!!

YSRCP:  వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ ఇటీవల దాదాపు 135 నామినేటెడ్ పోస్టులను భర్తీను భర్తీ చేసింది. పదవులు వచ్చిన వారు హాపీగా ఉన్నారు. ప్రాంతాలు, కులాలు, మతాల సమీకరణలతో పదవుల పందారం అయితే చేశారు గానీ కొన్ని చోట్ల స్థానిక ఎమ్మెల్యేలకు పెద్ద సమస్య అయ్యింది. నామినేటెడ్ పదవుల్లో వైసీపీ సర్కార్ ఎస్సీ, బీసీ, మైనార్టీ, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది.

YSRCP Chittoor dist temple trust board issues
YSRCP Chittoor dist temple trust board issues

Read More: Mysura reddy: గ్రేటర్ రాయలసీమకు ప్రత్యేక ప్రభుత్వం ఉండుంటే అంటూ మైసూరా సంచలన వ్యాఖ్యలు..

ఇక విషయానికి.. వస్తే రాష్ట్రంలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం మినహా ఇతర ఆలయాలకు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న స్థానిక నాయకులకే  ఆయా ఆలయాల పాలకమండలి చైర్మన్ పదవులు దక్కుతుంటాయి. చిత్తూరు జిల్లాలో తిరుమల శ్రీవారి ఆలయం తరువాత శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలు ప్రముఖ పుణ్యక్షేత్రాలుగా ఉన్నాయి. ఈ ఆలయాల చైర్మన్ పదవులపై ఆ ప్రాంత వైసీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆయా ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలకు సమాచారం లేకుండానే ఈ రెండు ఆలయాల చైర్మన్ పదవులను స్థానికేతరులకు వైసీపీ ప్రభుత్వం అప్పగించింది.

శ్రీకాళహస్తి వైసీపీ నేతలు అక్కడి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ ను, కాణీపాకం ఆలయ చైర్మన్ పదవి విషయంలో పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆలయ చైర్మన్ పదవులు స్థానికులకు కాకుండా వేరే వారిని నియమిస్తుంటే ఎలా అంగీకరించారంటూ ఆ ప్రాంత వైసీపీ నేతలు ఎమ్మెల్యేలను నిలదీస్తుంటే తమకు తెలియకుండానే నియామకాలు జరిగిపోయాయని చెబుతున్నారుట.  శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గా సత్యవేడు మండలానికి చెందిన బీరేంద్ర వర్మ నియమితులు కాగా, కాణిపాకం ఆలయ చైర్మన్గా మాజీ ఎంపి జ్ఞానేంద్రరెడ్డి వదిన చిత్తూరుకు చెందిన ప్రమీలమ్మ రెడ్డి నియమితులయ్యారు. కాణీపాకం ఆలయ చైర్మన్ పదవిని స్థానికేతరులకు ఇవ్వడంపై ఆ ప్రాంత వైసీపీ నేతలు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు దృష్టికి తెచ్చినా పట్టించుకోకపోవడంతో ధర్నాకు దిగారు. ఆలయ చైర్మన్ పదవి స్థానికేతరులకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయిస్తామని కూడా హెచ్చరిస్తున్నారుట.

జిల్లా మంత్రి ఒత్తిడి కారణంగానే ఈ ఆలయాల చైర్మన్ పదవులు స్థానికేతరులకు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. దశాబ్ధాలుగా వస్తున్న ఆనవాయితీని కాదని స్థానికేతరులకు చైర్మన్ పదవులు ఇస్తే తమను నమ్ముకున్న నాయకులకు ఏమి సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేలు మధనపడుతున్నారని సమాచారం. చిత్తూరు జిల్లాలో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసంతృప్తి వైసీపీ నేతలను ఏ విధంగా సమాధానపరుస్తారో వేచి చూడాలి.

author avatar
Srinivas Manem

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?