YSRCP Inner: వైసీపీ అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో మూడేళ్లు దాటింది. అయితే ఇప్పటి వరకూ కార్యకర్తల గురించి బహిరంగంగా మాట్లాడని ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు అధికార పార్టీ నేతలు ఇప్పుడు కార్యకర్తల సంక్షేమం, కార్యకర్తల బాగోగులు అంటూ మాట్లాడటం ఆ జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకరు ఆ జిల్లాలో పార్లమెంట్ సభ్యుడు కాగా మరొకరు తాజా మాజీ మంత్రి. ఈ ఇద్దరి మద్య జిల్లాలో రాజకీయ వైరం ఎప్పటి నుండో ఉందనేది టాక్. ఇప్పుడు ఈ విషయం ఎందుకు అంటే..

- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
YSRCP Inner: ‘కార్యకర్తలు ఆస్తులు అమ్ముకుని పార్టీ కోసం కష్టపడతారు’
ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గతంలో కాంగ్రెస్, ఆ తరువాత తెలుగుదేశంలో పని చేశారు. ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. ఆయన రీసెంట్ గా మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ లో పని చేశాననీ పేర్కొన్న మాగుంట.. పార్టీ ఏదైనా కార్యకర్తలే బలమని అన్నారు. కార్యకర్తలు ఆస్తులు అమ్ముకుని పార్టీ కోసం కష్టపడతారనీ, పార్టీలు ఉన్నాయంటే దానికి కారణం కార్యకర్తలేనని అన్నారు. సమావేశానికి పిలిస్తే పెండింగ్ బిల్లులు వచ్చేలా చూడాలని కార్యకర్తలు అడిగి పరిస్థితి వచ్చిందని శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. అయితే ఇదే జిల్లాకు చెందిన తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడటంతో ఇది శ్రీనివాసులు రెడ్డి మాటలకు కౌంటర్ యేనా అని అనుకుంటున్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి గతంలో 2017 -18 సమయంలో టీడీపీలో ఉన్నప్పుడూ కార్యకర్తల గురించి మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమ ప్రకాశంలో టీడీపీ బలపడకపోవడానికి కార్యకర్తల ఇబ్బందులే కారణమని పేర్కొన్నారు. ఆనంతరం ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. ఎంపి అయ్యారు. అయితే ఇప్పుడు మళ్లీ కార్యకర్తల గురించి మాగుంట అకస్మాత్తుగా మాట్లాడటంపై అనేక ఊహాగానాలు తలెత్తుతున్నాయి.
‘కార్యకర్తల జోలికి ఎవరైనా వస్తే ఊరుకోను’
తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి నుండి తొలగించినప్పుడు చాలా బాధపడ్డానని అన్నారు. తాను గతంలో మంత్రి పదవి వదులుకుని వైసీపీలోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మూడేళ్లు ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంజాయ్ చేశారని అన్న బాలినేని..కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ఎమ్మెల్యేలను సహించమని అన్నారు. కార్యకర్తలకే పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని, కార్యకర్తల జోలికి ఎవరైనా వస్తే ఊరుకోనని చెప్పారు. తనపై సీఎంకు ఫిర్యాదు చేసినా భయపడనని అన్నారు. మంత్రి పదవి అడిగాను కానీ సురేష్ కు మంత్రి పదవి ఇవ్వదని చెప్పలేదని బాలినేని వెల్లడించారు. మాగుంట కార్యకర్తల గురించి మాట్లాడటం, ఆ తరువాత దానికి కౌంటర్ అన్నట్లుగా బాలినేని వ్యాఖ్యలు చేయడంతో అంతర్గతంగా ఏదైనా రాజకీయం నడుస్తుందా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకూ కార్యకర్తల గురించి బహిరంగంగా మాట్లాడని బాలినేని ఇప్పుడే ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అన్నది హాట్ టాపిక్ అవుతోంది.