29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YSRCP Internal: రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు మళ్లీ ఖాయమే ..! కానీ..?

Share

YSRCP Internal: వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇటీవల కాలంలో వై నాట్ 175 అని పదేపదే చెబుతున్నారు. దాదాపుగా 86 శాతం మందికిపైగా సంక్షేమ పథకాలను అందించాం, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 90 శాతంపైగా నెరవేర్చాము, మంచి పరిపాలన అందిస్తున్నాం, ప్రజలు మనల్ని కాక ఇంకెవరిని దీవిస్తారు. ఆదరిస్తారు అని అంటున్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు మరో ఏడాదిన్నర వరకూ సమయం ఉన్నప్పటికీ ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ ప్రజల్లో తిరుగుతూ ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా లెక్కలు వేసుకుంటూ వ్యాహాలకు పదును పెడుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య త్రిముఖ పోరు జరిగితే గత ఎన్నికల ఫలితాలే పునరావృత్తం అవుతాయన్న భావన ప్రతిపక్షాల్లో ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

CM YS Jagan

YSRCP Internal: 40కిపైగా స్థానాలు తగ్గినా..

కాకపోతే గత ఎన్నికల్లో వచ్చిన భారీ మెజార్టీ స్థానాలు వైసీపీకి రావని ఓ 40 – 50 స్థానాలు తగ్గినా అధికారాన్ని సాధించడానికి సరిపడా 90 కిపైగా స్థానాలు వైసీపీ గెలుచుకుంటుంది లెక్కలు వేస్తున్నారు. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు. జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి. వేరువేరుగా పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి అని ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ వారి వారి సర్వే సంస్థల ద్వారా లెక్కలు తెప్పించుకుంటున్నాయి. వైసీపీ పలు అంతర్గత సర్వేల ద్వారా వచ్చిన లెక్క ఈ విధంగా ఉందట. వాళ్ల అంచనా ప్రకారం 110 సీట్లు తగ్గవు అని తేలినట్లుగా ప్రచారం జరుగుతోంది. టీీడీపీ – జనసేన కలిసి పోటీ చేసినా వైసీపీకి ఢోకా లేదు అన్న అంచనాలో ఉన్నట్లు గా ఆ పార్టీ ఉంది. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీగానే నష్టం వాటిల్లుతుందన్న అంచనాల్లో లెక్కలు ఉన్నాయిట.

జిల్లాల వారీగా వైసీపీ లెక్క

ఉభయ గోదావరి జిల్లాలో ( ఉమ్మడి తూర్పు గోదావరి లో 19, పశ్చిమ గోదావరిలో 15) మొత్తం 34 స్థానాలు ఉండగా, జనసేన, టీడీపీ పొత్తు ఉంటే వాళ్లకు 18 లేదా 19 వెళ్లాయి., వైసీపీకి ఈజీగా 15 సీట్లు ఖాయం అన్న లెక్కల్లో ఉన్నారు. అలానే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో 33 నియోజకవర్గాలు ఉండగా, వైసీపీకీ 13 ఈజీగా గెలుచుకోవచ్చు అన్న లెక్కల్లో ఉంది. ఉమ్మడి నెల్లూరు, ప్రకారం జిల్లాల్లో 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉండగా, వీటిలో 15 వైసీపీకి ఖాయమని భావిస్తొంది. రాయలసీమలో మొత్తం 52 స్థానాలు ఉండగా, 2019 ఎన్నికల్లో 49 స్థానాల్లో వైసీపీ గెలిచింది. కేవలం మూడు మాత్రమే టీడీపీ గెలిచింది. వాటిలో కుప్పం నుండి చంద్రబాబు, హిందూపుర్ నుండి నందమూరి బాలకృష్ణ, ఉరవకొండ నుండి పయ్యావుల కేశవ్ మాత్రమే గెలిచారు.

YSRCP

రాయలసీమలో

రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఉమ్మడి జిల్లాలలో 35 నుండి 37 స్థానాల్లో గెలుపు ఖాయమని వైసీపీ భావిస్తొంది. ఇక ఉత్తరాంధ్ర ప్రాంతంలో ( ఉమ్మడి విశాఖపట్నం 15, విజయనగరం 9, శ్రీకాకుళం 10) మొత్తం 34 నియోజకవర్గాలు ఉండగా, ఉత్తరాంధ్ర, రాజధాని సెంటి మెంట్ కారణంగా 20 నుండి 25 నియోజకవర్గాలు ఈజీగా గెలుచుకోవచ్చు అని లెక్కలు వేస్తొంది. ఈ లెక్కన 98 నుండి 108 స్థానాలు ఢోకా లేదు అని వైసీపీ అంతర్గత అంచనాగా ఉంది. 175 స్థానాలు ఉన్న ఏపి అసెంబ్లీలో అధికారంలోకి రావడానికి మ్యాజిక్ ఫిగర్ 88 స్థానాలు గెలుచుకుంటే సరిపోతుంది. మ్యాజిక్ ఫిగర్ కంటే పది నుండి 20 స్థానాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్లుగా అంచనాలు ఉండటంతో వైసీపీ నేతలు అధికారంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఏపిలో ప్రతిపక్షాలకు బిగ్ షాక్ .. రోడ్లపై సభలు, ర్యాలీలకు నిషేదాజ్ఞలు


Share

Related posts

Men: శృంగార సామర్ధ్యం కోసం పురుషులు ఈ మాత్రలను వాడితే ఇక తిరుగుండదు!!

Kumar

మా మీద దాడి కుట్ర బయటపడాలంటే పిన్నెల్లి కాల్ డేటా ను బయటపెట్టండి : బొండా ఉమా ఫైర్

Siva Prasad

ఘాటెక్కిన ట్వీటు…!

somaraju sharma