ANU, Guntur: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వైసీపీ (YSRCP) ఆధ్వర్యంలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతి, విశాఖపట్నంలో నిర్వహించిన రెండు జాబ్ మేళాల్లో 30వేల మంది యువతీ యువకులకు ఉద్యోగాలు లభించగా, శని, ఆదివారాల్లో గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో (ANU) నిర్వహించిన జాబ్ మేళాలో 10,480 మంది ఉద్యోగాలకు ఎంపికైయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అనుబంధ విభాగాల ఇన్ చార్జి విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకూ నిర్వహించిన మూడు విడతల జాబ్ మేళాల్లో 40,253 మంది నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించారన్నారు. జూన్ మొదటి వారంలో కడప యోగి వేమన యూనివర్శిటీలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు.

- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
YCP Job Mela: నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యే వరకూ..
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యే వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుందని విజయసాయి రెడ్డి చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మహత్తర అవకాశం కల్పించడం కోసం వైసీపీ ఈ కార్యక్రమం నిర్వహిస్తోందని తెలిపారు. అవకాశం ఉన్న ప్రతి చోట నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగాలు ఇప్పించాలన్నది జగన్ ఆశయమని పేర్కొన్నారు విజయసాయి రెడ్డి. ఈ సందర్భంలో వైసీపీ జాబ్ మేళాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఖండించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అర్హతలను బట్టి ఉద్యోగాలు
జాబ్ మేళాలో చిన్న చిన్న ఉద్యోగాలు మాత్రమే ఇస్తున్నారంటూ చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని అన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీీజీ, బీఈ, బీటెక్, ఇంజనీరింగ్ పీజీ అర్హతలను బట్టి వివిధ కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చారన్నారు. కనీస వేతనం రూ.15వేల నుండి గరిష్ట వేతనం లక్షకు పైగా ఉందని తెలిపారు. ఆదివారం జరిగిన ఇంటర్వ్యూలో ఒకరికి రూ.11 లక్షల ప్యాకేజీ తో ఆఫర్ లెటర్ ఇవ్వడం జరిగిందని చెప్పారు విజయసాయిరెడ్డి. ఇప్పటి వరకూ 540 కంపెనీల హెచ్ ఆర్ విభాగాల ప్రతినిధులు హజరై ఇంటర్వ్యూలు నిర్వహించారని చెప్పారు. ఆయా కంపెనీల యాజమాన్యాలకు, ప్రతినిధులకు విజయసాయి రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.