31.2 C
Hyderabad
March 23, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అన్ని వ్యవస్థలను పాడు చేసే వైరస్ లాంటిది తెలుగుదేశం పార్టీ అంటూ సజ్జల ఘాటు కామెంట్స్

Share

తెలుగుదేశం పార్టీ వైరస్ లాంటిదనీ, అన్ని వ్యవస్థలను ఆ వైరస్ పాడు చేస్తుందని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. పలువురు అధికారుల తీరుపై అనుమానాలు ఉన్నాయని అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు.

sajjala Rama Krishna Reddy

 

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ..  ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబుది దబాయింపు ధోరణేనని అన్నారు. చంద్రబాబు హయాంలో వ్యవస్థలను తొక్కి పెట్టారన్నారు. గత ప్రభుత్వం ప్రజా స్వామ్యాన్ని హత్య చేసిందని అన్నారు. అర్జెంట్ గా అధికారంలోకి వచ్చేయాలి అన్నది చంద్రబాబు ఆశ అని, ఆ ఆశలు కలలుగానే చంద్రబాబుకు మిగులుతాయన్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు.

పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయనీ, పలువురు అధికారుల తీరుపై అనుమానాలు ఉన్నాయన్నారు. ఒక్క బండిల్ లోనే ఆరు ఓట్లు తేడాగా కనిపించాయనీ, అన్ని బండిల్స్ లో కూడా గమనిస్తే అసలు విషయం తెలుస్తుందన్నారు. కౌంటింగ్ సమయంలో అధికారులు ఎలా వ్యవహరించారో చూశామన్నారు. వైసీపీ ఓట్లను టీ డీ పీ ఓట్లలో కలిపేశారని పేర్కొన్నారు. దీనిపై తమ నాయకులు ప్రశ్నిస్తే కౌంటింగ్ అయిపోయిన తర్వాత అడగాలని ఆర్వో అన్నారన్నారు. రీకౌంటింగ్ చేయాలని కోరడం అభ్యర్ధి హక్కు అని సజ్జల అన్నారు.  అధికారులపై తాము ఒత్తిడి తెస్తే రిజల్ట్ ఇలా ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. తమపై టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ ఎప్పుడూ ధర్మయుద్దమే చేస్తుందని సజ్జల పేర్కొన్నారు.

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత .. రేపు ఈడీ ముందుకు..?


Share

Related posts

వైసీపీలోకి మరో టీడీపీ మాజీ..! ముహూర్తం నేడే!

Muraliak

Railway News: రైలు ప్రయాణం చెయ్యాలి అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ వార్త.. మిగితా వాళ్ళు అస్సలు చదవకండి!

Ram