NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: విజయసాయి రెడ్డి విషయంలో జగన్ అలా చేయడం వైసీపీ లో ఎవ్వరికీ నచ్చడం లేదు ?

YSRCP: రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటి పోయింది. అయితే పార్టీ అధికారంలోకి వస్తే తమకు తిరుగు లేదు కాలర్ ఎగరేసుకుని తిరగవచ్చు, ఏ పని అయినా చేయించుకోవచ్చు అనుకున్న కేడర్ కు మాత్రం సరైన గుర్తింపు లేదనే ఆవేదన ఉంది. ఎన్నికల సమయంలో పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టి ఎన్నికల తరువాత పార్టీలో చేరి ఎమ్మెల్యేలకు భజన చేస్తూ వారి పక్కన తిరిగే వాళ్ల హవానే నడుస్తుందని కొన్ని చోట్ల నుండి వ్యాఖ్యానాలు వినబడుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ వ్యవహారాలపై అంతగా దృష్టి పెట్టకపోవడంతో పార్టీ అనుబంధ సంఘాలు బలోపేతం కావడం లేదన్న మాట వినబడుతోంది.

YSRCP leader Vijaya sai Reddy
YSRCP leader Vijaya sai Reddy

Read More: AP High Court: రాజధాని అమరావతి కేసులో హైకోర్టు కీలక తీర్పు..రాష్ట్ర ప్రభుత్వానికి బిగ్ షాక్..

YSRCP: జెండా మోసిన కార్యకర్తలకు ఆదరణ కరువు..?

క్షేత్ర స్థాయిలో జెండా మోసిన వారిపై పార్టీ నేతలు కన్నెత్తి చూడటం లేదనీ వారికి ఆదరణ కొరవడిందని అంటున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను సమీక్షించి సరి చేయాల్సిన అధిష్టానం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. బూత్ కన్వీనర్లు మండల స్థాయి కన్వీనర్ లకు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అంటున్నారు. వాలంటీర్లతోనే మొత్తం అన్ని వ్యవహారాలను జరిపించేస్తుంటే పార్టీ కార్యకర్తల మాట చెల్లుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్ల నియామక సమయంలోనూ పార్టీ కోసం పని చేసి వారికి కాకుండా ఎమ్మెల్యేలకు అనుకూలమైన వారినే నియమించుకున్నారని దీంతో వారు పార్టీ కార్యకర్తల మాట లెక్కచేయడం లేదని వాపోతున్నారు.

పార్టీ అనుబంధ సంఘాల ఇన్ చార్జిగా విజయసాయిరెడ్డి

ఈ తరుణంలో పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి రీసెంట్ గా పార్టీ అనుబంధ సంఘాల ఇన్ చార్జిగా విజయసాయిరెడ్డిని నియమించారు. ఆయనకు రాజ్యసభ రెన్యువల్ చేయకుండా ఉండేందుకే ఈ పదవి ఇచ్చారన్న మాట వినబడుతోంది. ఈ తరుణంలో ఇన్ చార్జిగా బాధ్యతలు చేపట్టిన  విజయసాయిరెడ్డి క్షేత్ర స్థాయిలో క్యాడర్ పరిస్థితులను తెలుసుకుని సరి చేయగలరా..? అని ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్న విజయసాయిని పార్టీకే పరిమితం చేస్తారనడం పట్ల అభిమానులు నిరుత్సాహపడుతున్నారుట.

author avatar
sharma somaraju Content Editor

Related posts

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N