Subscribe for notification

Amalapuram violence: అమలాపురం అల్లర్లపై వైసీపీ ప్రమఖుల కామెంట్స్ ఇవీ

Share

Amalapuram violence: కోనసీమ జిల్లానే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కోనసీమ జిల్లా సాదన సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా నిరనస కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చిన కోనసీమ జిల్లా సాధన సమితి… చేపట్టిన జిల్లా కలెక్టరేట్ ముట్టడి ఆందోళన అదుపుతప్పి మంత్రి విశ్వరూప్, వైసీపీ ఎమ్మెల్యే సతీశ్ నివాసాలకు నిప్పు పెట్టడం. పలు వాహనాలను ధ్వంసం చేయడం, పోలీసులపై రాళ్లు రువ్వడంతో అమలాపురంలో హైటెన్షన్ నెలకొంది. ఈ విద్వంసకర సంఘటనలపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. కోనసీమ జిల్లాలో నిషేదాజ్ఢలను అమలు చేయడంతో పాటు భారీగా పోలీసు బలగాలను మొహరించారు. ఆందోళనలపై తప్పుడు ప్రచారాలను నిరోధించేందుకు జిల్లాలో ఇంటర్నెట్ సేవలను నిలుపుదల చేశారు. దాదాపు 50 మందికి పైగా ఆఁదోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అల్లర్లను పురస్కరించుకుని ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తుండగా, దీని వెనుక టీడీపీ, జనసేన ఉన్నాయంటూ వైసీపీ ప్రముఖులు. మంత్రులు ఆరోపిస్తున్నారు. అమలాపురం అల్లర్లపై మంత్రులు ఏమన్నారంటే..

ysrcp leaders comments on Amalapuram Violence

Amalapuram violence: అల్లర్ల వెనుక రాజకీయ కుట్ర

కోనసీమ అల్లర్ల వెనుక రాజకీయ కుట్ర స్పష్టంగా అర్ధం అవుతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కొంత మంది ప్రవర్తన ఇందుకు సాక్షంగా నిలుస్తుందన్నారు. అమలాపురం దాడులపై ప్రతిపక్షాల స్పందన చూస్తుంటే వాళ్లే కథ అంతా నడిపిస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయని అన్నారు సజ్జల. ఈ అల్లర్ల కేసులో నిందితులపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. మా పార్టీ నేతల ఇళ్లపై తామే దాడి చేసుకుంటామా అని ప్రశ్నించారు సజ్జల. దాడుల్లో పాల్గొన్న అన్నం సాయి అనే యువకుడు జనసేన పార్టీకి చెందిన వాడనీ, అతను జనసేన కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోలు వచ్చాయని చెప్పారు. విపక్షాలు చేస్తున్న ఆరోైపణలకు ఏమైనా అర్ధం ఉందా అని సజ్జల ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ అర్ధం లేకుండా మాట్లాడుతున్నారనీ, టీడీపీ స్క్రిప్ట్ చదువుతున్నట్లు ఉందని విమర్శించారు.

botsa satyanarayana

 

అమలాపురం ఘటన దురదృష్టకరమని అన్నారు సీనియర్ మంత్రి బొత్సా సత్యనారాయణ. రాజకీయ కుట్రతో పచ్చని కోనసీమలో చిచ్చు పెట్టారని విమర్శించారు. అల్లర్లలో పాల్పన్న వారిని వదిలిపెట్టే ప్రశక్తి లేదని అన్నారు. స్వార్ధరాజకీయాల కోసం విపక్షాలు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనించాలని కోరారు మంత్రి బొత్స. రాజకీయ లబ్ది పొందాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నారని బొత్స విమర్శించారు. పోలీసులు సంయమనం పాటించి ప్రాణనష్టం లేకుండా నివారించారని ప్రశంసించారు. బీఆర్ అంబేద్కర్ ఒక కులానికో ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదనీ రాజ్యాంగ నిర్మాత అని అన్నారు. అటువంటి మహనీయుడు పేరు జిల్లాకు పెడిత ఎందుకు అల్లర్లకు పాల్పడ్డారని ప్రశ్నించారు.

 

కోనసీమలో అల్లర్లు సృష్టించి వైసీపీ పాలనపై బురద జల్లాలని ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు మంత్రి ఆర్కే రోజా. కుట్ర వెనుక ఎవరు ఉన్నారో బయటకు లాగుతామని అన్నారు. ఇవే ప్రతిపక్షాలు జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని నిరాహార దీక్షలు చేశారని గుర్తు చేశారు. సూసైడ్ చేసుకుంటామని టీవీల ముందుకు వచ్చిన వారు జనసేన నేత పవన్ కళ్యాణ్ తో ఎంత క్లోజ్ గా ఉన్నారో ఫోటోలు చూస్తే తెలుస్తుందని పేర్కొన్నారు ఆర్ కే రోజా. బీఆర్ అంబేద్కర్ పేరు కోనసీమ జిల్లాకు పెడుతుంటే గొడవ చేయడం బాధాకరమని అన్నారు.


Share
somaraju sharma

Recent Posts

Rakul Preet Singh: ఆ కుర్ర హీరోతోనే మరో సినిమా చేస్తోన్న రకుల్.. అసలేం జరుగుతోంది..?

Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్‌పైనే…

16 mins ago

Dil Raju: ఇండస్ట్రీలో మరో సంచలనానికి తెర లేపిన దిల్ రాజు..??

Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…

1 hour ago

Today Horoscope: జూలై 5 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…

3 hours ago

Samantha Tapsee: సమంత సినిమా పై క్లారిటీ ఇచ్చిన తాప్సి..!!

Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…

6 hours ago

God Father: చిరంజీవి “గాడ్ ఫాదర్” లుక్ అదరగొట్టేసింది.. ఫ్యాన్స్ నుండి పాజిటివ్ టాక్..!!

God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…

7 hours ago

Ram Pothineni Boyapati: రామ్ పోతినేని మూవీకి కూడా బాలకృష్ణ హిట్ ఫార్ములా వాడుతున్న బోయపాటి..??

Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…

9 hours ago